కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 55

సినిమా వార్తలు

`మెగాస్టార్ చిరంజీవి - 152` కోసం భారీ బడ్జెట్ ?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే... ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో క్రైమ్ థ్రిల్ల‌ర్‌తో ‘దేవదాస్’ ద‌ర్శ‌కుడు?

‘భలే మంచి రోజు’(2015)తో దర్శకుడిగా తొలి అడుగులు వేసాడు శ్రీరామ్ ఆదిత్య. అనంతరం ‘శమంతకమణి’(2017), ‘దేవదాస్’(2018)తో టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విషయమేమిటంటే... ఈ మూడు చిత్రాలు కూడా క్రైమ్, థ్రిల్లింగ్‌ అండ్ కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందాయి. కాగా... త‌న నాలుగో సినిమాని కూడా క్రైమ్ థ్రిల్ల‌ర్‌గానే ఆదిత్య ప్లాన్ చేశాడ‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న `ఖైదీ`

కార్తి క‌థానాయ‌కుడిగా లోకేష్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన త‌మిళ‌ చిత్రం `ఖైదీ`. రా- యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా... తెలుగులోనూ అదే పేరుతో అనువాదం కానుంది. ఇందులో యావ‌జ్జీవ ఖైదీ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు కార్తి. ప‌దేళ్ళుగా జైలుశిక్ష అనుభ‌విస్తున్న దిల్లీ అనే ఓ ఖైదీ... త‌న ప‌దేళ్ళ కూతురిని చూడ‌డం కోసం ఓ రోజు రాత్రి చెర‌సాల నుంచి త‌ప్పించుకుంటాడు. ఈ నేప‌థ్యంలో... దిల్లీకి ఎదురైన అనుభ‌వాలేంటి? అనే అంశంతో `ఖైదీ` తెర‌కెక్కింది. నాలుగు గంట‌ల్లో చోటుచేసుకున్న పరిణామాల చుట్టూ అల్లుకున్న ఈ క‌థ‌లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు తండ్రీకూతుళ్ళ అనుబంధానికి కూడా పెద్ద పీట వేశాడు…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'ఆదిత్య వర్మ' ట్రైలర్ రిలీజ్

మొత్తానికి 'అర్జునరెడ్డి' తమిళ్ రీమేక్ 'ఆదిత్య వర్మ' అన్ని పనులు త్వరగా ముగించుకొని రిలీజ్ కు సిద్ధపడుతుంది. మొదటినుండి ఈ సినిమాకు కాస్త ఇబ్బందులు ఎదురైనా.. విక్రమ్ మాత్రం పట్టుపట్టి ఈ సినిమాను ఫైనల్ గా రిలీజ్ కు సిద్ధం చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే.. కొడుకు ధృవ్ కంటే కూడా విక్రమ్ కే సినిమా ఎలా ఉంటుందో అని ఎక్కువ హార్ట్ బీట్ పెరిగిపోతుందట. ఇక ఈ సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్ నురిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Ala Vaikunthapurramuloo Movie Songs, Ala Vaikunthapurramuloo New Song Promo, Ala Vaikunthapurramuloo Songs, Ramuloo Ramulaa Song From Ala Vaikunthapurramuloo, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema Ne
సాంగ్

'అల వైకుంఠపురములో' నుండి 'రాములో రాములా'

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. ఇక ఇటీవలే ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’ అన్న పాటను రిలీజ్ చేయగా దానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్‌లో ఇప్పటివరకు ఏడు లక్షల లైక్‌లు సాధించిన తొలి తెలుగు పాటగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆమె హిందీ 'రీమేక్' అమలా పాల్ ప్లేస్ లో బాలీవుడ్ క్వీన్

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ 'ఆడై' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేశారు. తెలుగులో 'ఆమె' పేరుతో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో నగ్నంగా నటించి అమలాపాల్‌ సంచలనం సృష్టించారు. వీ స్టూడియోస్‌ బ్యానర్‌పై విజ్జి సుబ్రమణియన్ ఈసినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలో నటించిన అమలా పాల్ నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. కామిని పాత్రలో నటించడానికి అంత ధైర్యం చేసిన అమలా పాల్ విమర్శకుల ప్రసంశలు పొందింది.

TFN Adminవాట్సాప్
Shivan Trailer To Be Out Soon,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Shivan Trailer,Shivan Movie Trailer,Shivan Telugu Movie Trailer,Shivan Movie Latest News,Shivan Movie Updates
ట్రైలర్ & టీజర్

'శివన్' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శివన్ దర్శకత్వంలో సాయి తేజ కల్వకోట, తరుణి సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా శివన్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా టీజర్ ను ఇదివరకే రిలీజ్ చేయగా.. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. అక్టోబర్ 24వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

లెజెండరీ యాక్ట్రెస్ @ 400

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, ఏఎన్నార్, తమిళ్ లో శివాజీ గణేశన్, ఎం.జీ రామచంద్రన్ వంటి మహా మహిళతో నటించిన లెజెండరీ యాక్ట్రెస్ షావుకారు జానకి. " షావుకారు" అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి.. అదే సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకొని.. తన సినీ ప్రస్థానం లో ఎన్నో సినిమాలు చేసి ఎంతో మంది హీరోయిన్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఇక తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ ఇలా పలు భాషల్లో ఇప్పటివరకూ దాదాపు 400 సినిమాల్లో నటించారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

డిస్కో రాజా మూవీ యాక్షన్ సీన్స్ షెడ్యూల్ పూర్తి

SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ రివెంజ్ డ్రామా డిస్కో రాజా మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో రవితేజ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్, నభా నటేష్ కథానాయికలు. వెన్నెల కిషోర్, సునీల్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ S సంగీతం అందించారు. వినాయక చవితి సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తండ్రీ తనయుల మల్టీ స్టారర్ మూవీ

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి ఘనవిజయం సాధించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ మూవీ హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. E 4 ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ మూవీ గిరీశాయి దర్శకత్వంలో ఆదిత్య వర్మ గా రూపొందింది. ఆదిత్య వర్మ మూవీ తో తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ హీరోగా కోలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
First South Indian Star To Debut On Google Cameo,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,First South Indian Star,Naga Chaitanya First South Indian actor to debut on Google Cameos,1st South Indian
సినిమా వార్తలు

'గూగుల్ కామియో' - సౌత్ ఇండియాలో మొదటి నటుడు

'గూగుల్ కామియో' ఏంటి నాగచైతన్య మొదటి హీరో ఏంటి అనుకుంటున్నారా..? అసలుసంగతేంటంటే.. ఫ్యాన్స్ కు తమ అభిమాన హీరోల గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటారు. ఇక హీరోలకు కూడా కొన్ని రొటీన్ ప్రశ్నలే ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో నాగ చైతన్య తన అభిమానుల కోసం నాగచైతన్య ఓ సరికొత్త ఆలోచన చేశాడు. గూగుల్ కామియో అనే యాప్ ద్వారా తనను రెగ్యులర్ గా అడిగే ప్రశ్నలకు తనే స్వయంగా సమాధానాలు.. గూగుల్ క్యామియో లో పెట్టాడు. దీనివల్లే ఉపయోగం ఏంటంటే.. డైరక్ట్ గా గూగుల్ క్రోమ్ లోకి వెళ్లి నాగచైతన్య అని టైపు చేసి సెర్చ్ చేస్తే చాలు. "మోస్ట్ ఆస్క్ డ్ క్వశ్చన్స్" ట్యాగ్ కింద స్వయంగా నాగచైతన్య…

TFN Adminవాట్సాప్
NTR First Look from RRR on Komaram Bheem Birth Anniversary,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,NTR First Look from RRR,Komaram Bheem Birth Anniversary,NTR First Look,RRR Movie Updates
ఫస్ట్ లుక్

'ఆర్.ఆర్.ఆర్' - కొమరం భీమ్ లుక్ వచ్చేనా...!

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమా నుండి చాలా కాలంగా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు కొమరం భీమ్ జయంతి సందర్భంగా తమ అధికారిక ట్విట్టర్ ద్వారా అప్ డేట్ ఇచ్చారు. " స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన ధీరుడు కొమరం భీమ్... ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం.. ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ ను యంగ్ భీమ్ గా వెండితెరపై చూపించడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాం" అని అన్నారు. దీనితో ఈ…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రంగమార్తాండ మూవీ లో చిన్నారి పెళ్ళికూతురు

చిన్నారి పెళ్ళికూతురు గా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన అవికా గోర్ పలు టివి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. సక్సెస్ ఫుల్ మూవీ ఉయ్యాల జంపాల తో టాలీవుడ్ కు పరిచయమైన అవికాగోర్ నటించిన సినిమా చూపిస్త మావ, ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీస్ విజయం సాధించాయి. రీసెంట్ గా రిలీజయిన రాజు గారి గది 3 మూవీ లో పెర్ఫార్మెన్స్ కు అవికాగోర్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .

Team TFNవాట్సాప్
సాంగ్

సరిలేరు నీకెవ్వరు స్పెషల్ సాంగ్ నవంబర్ లో చిత్రీకరణ

సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూర్తి వినోదభరితంగా తెరకెక్కుతున్న ఈ మూవీ రీసెంట్ గా ఒక షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకొంది. మరొక షూటింగ్ షెడ్యూల్ తో మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ ఉంది. ఆసాంగ్ కు డాన్స్ లో తనదైన స్టైల్ ఉన్నతమన్నా ఎంపికయ్యారు.

Team TFNవాట్సాప్
Japan Begins Prabhas Birthday Celebrations,Tribute To Prabhas On His Birthday,2019 Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood cinema News,Happy Birthday to Prabhas,Prabhas Birthday Special,Prabhas Birthday Celebratio
సినిమా వార్తలు

జపాన్ లో ఘనంగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. ఇక ప్రభాస్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడ మాత్రమే కాదు విదేశాల్లో కూడా ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్ లో అయితే ప్రభాస్ కు విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. అంతేకాదు అక్కడ ప్రభాస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. ప్రభాస్ ను కలవడానికి అక్కడినుండి ఇక్కడికి వచ్చారంటేనే అర్ధం చేసుకోవచ్చు... ప్రభాస్ కు ఉన్న క్రేజ్ గురించి..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆరు సినిమాల‌తో దీపావ‌ళి సంద‌డి

తెలుగునాట సంక్రాంతి, దసరా తరువాత ప్రత్యేకంగా జరుపుకునే పండగ దీపావళి. అలాంటి ఈ పండ‌గ సీజ‌న్‌లో మంచి క్రేజ్ ఉన్న తెలుగు చిత్రాలు విడుద‌లైతే ఆ సంద‌డే వేరుగా ఉంటుంది. అయితే, ఈ ఏడాది దీపావళికి అలాంటి వాతావ‌ర‌ణం లేక‌పోయినా... తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆరు చిత్రాలు సంద‌డి చేయ‌బోతుండ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ అర‌డ‌జ‌ను సినిమాల్లో ఒకటి తెలుగు పిక్చ‌ర్ కాగా... రెండు త‌మిళ అనువాద చిత్రాలు, మూడు హిందీ ఫిల్మ్స్ ఉండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కృష్ణవంశీ ‘సముద్రం’కు 20 ఏళ్ళు

తెలుగు చిత్ర‌ పరిశ్రమలో కంటెంట్ ఉన్న అతి కొద్ది మంది ద‌ర్శ‌కుల‌లో కృష్ణవంశీ ఒక‌రు. అలాంటి ఈ క్రియేటివ్ డైరెక్ట‌ర్ తెరకెక్కించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్స్‌లో ‘సముద్రం’ ఒకటి. జగపతిబాబు, సాక్షి శివానంద్ జంటగా న‌టించిన ఈ సినిమాలో రవితేజ, శ్రీహరి, ప్రకాష్ రాజ్, తనికెళ్ళ భరణి, శివాజీరాజా, ఉత్తేజ్, సుధ, ప్రత్యూష తదితరులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. రాశి ప్రత్యేక గీతంలో నర్తించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘టాక్సీవాలా’ రీమేక్‌లో ‘ధడక్’ హీరో

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, తెలుగ‌మ్మాయి ప్రియాంక జావల్కర్ జంటగా నటించిన ‘టాక్సీవాలా’(2018)... తెలుగునాట మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రాహుల్ సంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సూప‌ర్ నేచుర‌ల్ కామెడీ థ్రిల్ల‌ర్‌... ఇప్పుడు హిందీనాట రీమేక్ అవుతోంది. `కాలీ పీలీ` పేరుతో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో `ధ‌డ‌క్‌` ఫేమ్ ఇషాన్ ఖ‌ట్ట‌ర్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తుండ‌గా, అన‌న్య పాండే నాయిక‌గా న‌టిస్తోంది. మక్బూల్ ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని మరో డైరెక్ట‌ర్‌ అలీ అబ్బాస్ జాఫర్ నిర్మిస్తుండ‌డం విశేషం. కాగా... ప్ర‌స్తుతం మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నెల‌కో `మెగా` టైటిల్ మూవీ సంద‌డి

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ తాలూకు టైటిల్స్‌తో యువ క‌థానాయ‌కుల చిత్రాలు రావ‌డం కొత్తేమీ కాదు. అయితే... ఒకే క్యాలెండరు ఇయర్‌లో వ‌రుస‌గా మూడు నెలల పాటు `చిరు` టైటిల్స్‌తో సినిమాలు విడుదల కావడం మాత్రం క‌చ్చితంగా వార్త‌ల్లో నిల‌చే అంశ‌మే. అలా... 2019 ఆగ‌స్టు, సెప్టెంబ‌ర్‌, అక్టోబ‌ర్ నెల‌లు మెగా టైటిల్స్‌తో ఆస‌క్తి రేకెత్తిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అనుష్క బ‌ర్త్ డేకి ‘నిశ్శబ్దం’ టీజర్?

ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న‌ కథానాయికల్లో అనుష్క ఒక‌రు. ‘భాగమతి’ త‌రువాత స్వ‌ల్ప‌ విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్ర‌స్... తాజాగా ‘సైలెన్స్’ అనే మల్టీలింగ్వ‌ల్ మూవీలో న‌టించిన‌ సంగతి తెలిసిందే. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రిలీజ్ కానున్న‌ ఈ చిత్రం... తమిళ‌, కన్నడ‌, మలయాళ, హిందీ, ఆంగ్ల‌ భాషల్లో ‘సైలెన్స్’గా విడుదల కానుంది. కాగా... చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది.

Team TFNవాట్సాప్

షేర్