తమిళ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.దాదాపు 180కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రంపై అంచనాలు కూడా మాములుగా లేవు. ఇప్పుడు బిగిల్ మూవీ కి మరో అరుదైన గౌరవం దక్కింది. బిగిల్ చిత్రానికి ట్విట్టర్ ప్రత్యేకమైన ఎమోజి సింబల్ ఇవ్వడం జరిగింది. గతంలో మెర్సిల్ సినిమా కు ట్విట్టర్ ఎమోజీ రాగా.. ఇప్పుడు బిగిల్ మూవీ కూడా ఈ లిస్ట్ లో చేరింది. బిగిల్ కు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చింది. కాగా విజయ్ కి జంటగా నయనతార నటిస్తున్న బిగిల్ దీపావళి కానుకగా ఈనెల 25న తమిళ మరియు తెలుగు భాషలలో విడుదల అవుతుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఏ జి ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మితమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన మన తెలుగు సినిమా సాహో కు కూడా ట్విట్టర్ ఎమోజీ వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ‘సాహో ది గేమ్’ పేరుతో ఓ వీడియో గేమ్ ని విడుదల చేశారు. ఈ గేమ్ ని పబ్జీ లాంటి గేమ్ ను డిజైన్ చేసిన ప్రఖ్యాత గేమ్ డెవలపింగ్ సంస్థ ఫిక్స లాట్ ల్యాబ్స్ డెవలప్ చేయడం జరిగింది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: