ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 52

"గుడ్ లక్ సఖీ"

85 ఏళ్ళ బామ్మ పాత్రలో కాజల్?
సోమవారం నుంచి `ఆర్ ఆర్ ఆర్` కొత్త షెడ్యూల్?
అల్లు అర్జున్‌కి విలన్‌గా సముద్రఖని
'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్
బాలీవుడ్ మూవీ మహాభారత్ లో ద్రౌపది

3 నిముషాలు.. సింగిల్ షాట్ హైలైట్ సీన్

దర్శకురాలిగా మారిన రాధికా ఆప్టే
రంగమార్తాండ మూవీ లో అమితాబ్ ?

100రోజులు పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్
క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ కి చిరంజీవి ఆతిథ్యం
`అసురన్` రీమేక్‌లో వెంకటేష్
కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కళ్యాణ్ దేవ్ హీరోగా పులి వాసు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ టైటిల్ సూపర్ మచ్చి, ఫస్ట్ లుక్ ను దీపావళి పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ ఈరోజు రిలీజ్ చేసింది. ఈ మూవీ లో తూనీగ తూనీగ ఫేమ్ రియా చక్రవర్తి హీరోయిన్ కాగా నరేష్, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.

"గుడ్ లక్ సఖీ"
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కీర్తిసురేష్ లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ మహానటి లో సావిత్రి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసల తోపాటు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మహానటి మూవీ తరువాత కీర్తి సురేష్ రెండు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ లోనటిస్తున్నారు . నరేంద్ర నాథ్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మిస్ ఇండియా మొదటిది. మిస్ ఇండియా టీజర్ రిలీజయి మూవీ పై హైప్ ను క్రియేట్ చేసింది.
ప్రకాష్ రాజ్ కు బాలయ్య టెక్నీషియన్ స్ట్రాంగ్ రిప్లై
ప్రకాష్ రాజ్ లాంటి నటులు సినీ పరిశ్రమకు దొరకడం ఒకింత అదృష్టమనే చెప్పొచ్చు. విలన్ పాత్రలు కానీ.. బొమ్మరిల్లు లాంటి తండ్రి పాత్ర అయినా.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో రేలంగి మావయ్య లాంటి పాత్ర అయినా సరే ప్రకాష్ రాజ్ ముందు తేలిపోవాల్సిందే. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటనకు జీవం పోస్తాడు. భారతీయ సినీ ప్రపంచంలో ఉన్న గొప్ప నటుల్లో ప్రకాష్ రాజ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా నాణానికి ఒక కోణం అయితే మరో కోణం కూడా ఉంటుంది. అలానే ప్రకాష్ రాజ్ కూడా గొప్ప నటుడే కానీ.. షూటింగుల్లో అయన చేసే బిహేవియర్ పై చాలా కంప్లైట్స్ ఉన్నాయి. ఇక కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఆయనకు బ్యాన్ కూడా చేసిన…

85 ఏళ్ళ బామ్మ పాత్రలో కాజల్?
పుష్కరకాలంగా కథానాయికగా రాణిస్తున్న వైనం కాజల్ అగర్వాల్ సొంతం. అందం, అభినయం మెండుగా ఉన్న ఈ టాలీవుడ్ చందమామ... ఇప్పటివరకు `అమ్మ` పాత్రల్లో నటించిన సందర్భాలే లేవు. అలాంటిది.. ఓ ప్రతిష్ఠాత్మక చిత్రం కోసం ఏకంగా 85 ఏళ్ళ బామ్మగా కనిపించబోతోందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.
సోమవారం నుంచి `ఆర్ ఆర్ ఆర్` కొత్త షెడ్యూల్?
దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి తొలిసారి ఓ హిస్టారికల్ ఫిక్షన్ తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రమే... `ఆర్ ఆర్ ఆర్`. ఇద్దరు తెలుగు పోరాట యోధుల (అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్) జీవితాల్ని మిళితం చేస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు జక్కన్న. 1920 నేపథ్యంలో సాగే ఈ పిరియాడికల్ డ్రామాలో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తుంటే... అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సింహభాగం చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. కాగా... తాజా షెడ్యూల్‌ని సోమవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారని టాక్. ఈ…
అల్లు అర్జున్‌కి విలన్‌గా సముద్రఖని
సముద్రఖని... తమిళ సినిమాలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు. తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ తనదైన ముద్రవేశాడాయన. అంతేకాదు.. తెలుగులోనూ `శంభో శివ శంభో`, `జెండాపై కపిరాజు` వంటి చిత్రాలను డైరెక్ట్ చేశాడు సముద్రఖని. అలాగే పలు తమిళ అనువాద చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో కనిపించాడు కూడా.
లేడీ అమితాబ్ విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ , ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
'సరిలేరు నీకెవ్వరు' ఉదయం విజయశాంతి- సాయంత్రం మహేష్ బాబు
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

కళ్యాణ్ దేవ్ రెండో సినిమా - టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్
విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. అయితే కల్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు సైమా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా పురస్కారం కూడా అందుకున్నాడు.
'అసురన్' రీమేక్ వెంకటేష్ కన్ఫామ్
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన 'అసురన్' ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ ఈ రీమేక్ ను చేస్తున్నట్టు టాలీవుడ్ లో ఒకటే వార్తలు చక్కర్లు కొట్టాయి.

ఖైదీ మూవీ తెలుగు రివ్యూ - బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉండే ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

విజిల్ మూవీ రివ్యూ - విజయ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే
ఓవరాల్ గా చెప్పాలంటే ఒకసారి చూడదగ్గ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ విజిల్ అని చెప్పొచ్చు.
కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ పోస్టర్
టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నిజ జీవిత రాజకీయ నాయకుల పాత్రలతో కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందుతుంది. కాంట్రవర్సీ మూవీస్ రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందించిన RGV మరో వివాదాస్పద మూవీ KRKR ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. KRKR మూవీ 3 సాంగ్స్ రిలీజ్ చేసి RGV ప్రేక్షకులలో మూవీ పై ఆసక్తి కలిగించారు.
బాలీవుడ్ మూవీ మహాభారత్ లో ద్రౌపది
బ్లాక్ బస్టర్ మూవీ ఓం శాంతి ఓం తో బాలీవుడ్ లో ఎంటరయిన దీపికా పడుకొనే నటించిన చాందిని చౌక్ టు చైనా, లవ్ ఆజ్ కల్, హౌస్ ఫుల్ , కాక్ టైల్ , రేస్ 2, చెన్నై ఎక్స్ ప్రెస్, రామ్ లీల, పీకు, భాజీరావ్ మస్తానీ, పద్మావత్ సాధించాయి. యాసిడ్ అటాక్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన చాపాక్ మూవీ లో దీపికా నటించి, సహనిర్మాతగా వ్యవహరించారు. 1983 క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో రూపొందిన 83 మూవీ కి దీపిక నటి,సహ నిర్మాత.

3 నిముషాలు.. సింగిల్ షాట్ హైలైట్ సీన్
'మా నగరం' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగు రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు.

దర్శకురాలిగా మారిన రాధికా ఆప్టే
ఉత్తరాదిన.. దక్షిణాదిన కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ రాధికా ఆప్టే. పాత్ర ప్రధానమైన పాత్రలను ఎంచుకుంటూ.. మంచి మంచి పాత్రలతో తన నటనతో అందరినీ మెప్పించింది. ఇక ఇన్ని రోజులు నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిన రాధికా ఆప్టే.. ఇప్పుడు దర్శకురాలిగా మారింది.
రంగమార్తాండ మూవీ లో అమితాబ్ ?
రెడ్ బల్బ్ మూవీస్, SVR గ్రూప్ , హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్స్ పై ట్యాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో రంగమార్తాండ మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ మరాఠీ మూవీ నటసామ్రాట్ కు తెలుగు రీమేక్ గా రంగమార్తాండ మూవీరూపొందుతుంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తున్న ఈ మూవీ లో వారి తనయ క్యారెక్టర్ కు అవికాగోర్ ఎంపిక అయ్యారు. ఈ మూవీ లీడ్ క్యారెక్టర్ గురువు క్యారెక్టర్ కై బాలీవుడ్ సూపర్ స్టార్ ను దర్శకుడు కృష్ణవంశీ సంప్రదించినట్టుసమాచారం .

100రోజులు పూర్తిచేసుకున్న ఇస్మార్ట్ శంకర్
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై పూరి కనెక్ట్స్ (పూరి జగన్నాథ్, ఛార్మి )నిర్మాణసారథ్యంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా రూపొందిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ఇస్మార్ట్ శంకర్ జులై 18 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. పక్కా హైదరాబాదీ గా మాస్ క్యారెక్టర్ లో హీరో రామ్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు. నిధి అగర్వాల్ , నభా నటేష్ కథానాయికలు. సత్యదేవ్, పునీత్ ఇస్సార్, అశీష్ విద్యార్థి, షాయాజీ షిండే ముఖ్య పాత్రలలో నటించారు.
క్లాస్ ఆఫ్ ఎయిటీస్ పార్టీ కి చిరంజీవి ఆతిథ్యం
క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అంటే 1980 దశకం లో నటీనటులు అందరూ ప్రతీ సంవత్సరం ఒక చోట రీ యూనియన్ అవడం. మోహన్ లాల్ , చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నరేష్, అర్జున్, జాకీ ష్రాఫ్, ప్రభు, భాగ్యరాజ్, సత్యరాజ్, జయరామ్, సుమన్ , రమ్యకృష్ణ, సుమలత, శోభన , సుహాసిని, రాధిక, ఖుష్బూ, నదియా ఈ టీమ్ లో ఉన్నారు. ప్రతీ సంవత్సరం ఈ టీమ్ మెంబర్ ఒకరు సభ్యులందరికీ పార్టీ ఎరేంజ్ చేయాలి. వీరందరూ పాల్గొనే ప్రతీ సంవత్సరం పార్టీ కి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది.
`అసురన్` రీమేక్‌లో వెంకటేష్
విక్టరీ వెంకటేష్ పలు రీమేక్ చిత్రాల్లో సందడి చేశారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. కాగా... `గురు`(2017) తరువాత మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకీ. అదే... తమిళ చిత్రం `అసురన్`. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ విలేజ్ డ్రామా తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 4న రిలీజైన ఈ సెన్సేషనల్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేయగా... కలైపులి థాను నిర్మించారు. ఇక తెలుగు వెర్షన్‌ని డి.సురేష్ బాబుతో పాటు మాతృక నిర్మాత కలైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వెంకటేష్…