సముద్రఖని… తమిళ సినిమాలను చూసేవారికి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేని పేరు. తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ తనదైన ముద్రవేశాడాయన. అంతేకాదు.. తెలుగులోనూ `శంభో శివ శంభో`, `జెండాపై కపిరాజు` వంటి చిత్రాలను డైరెక్ట్ చేశాడు సముద్రఖని. అలాగే పలు తమిళ అనువాద చిత్రాల్లో విలక్షణ పాత్రల్లో కనిపించాడు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం సముద్రఖని రెండు ప్రతిష్ఠాత్మక తెలుగు చిత్రాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్` కాగా… మరొకటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న `అల వైకుంఠపురములో`. `ఆర్ ఆర్ ఆర్`లో సముద్రఖని పాత్రపై క్లారిటీ రాకపోయినా… `అల వైకుంఠపురములో` చిత్రంలో మాత్రం ఓ విలన్‌గా నటిస్తున్నాడని తెలిసింది. అంతేకాదు.. పంచెకట్టుతో, శ్రీకాకుళం యాసతో సముద్రఖని కనిపిస్తాడని టాక్.
మరి… `ఆర్ ఆర్ ఆర్`, `అల వైకుంఠపురములో`తరువాత సముద్రఖని తెలుగునాట కూడా బిజీ అవుతాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: