
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 51


త్వరలో సెట్స్ పైకి బన్నీ-సుకుమార్ మూవీ..!
హీరో కార్తీ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2

దీపావళికి టాలీవుడ్ ట్రీట్
దర్బార్ మూవీ కొత్త పోస్టర్
నవంబర్ నుంచి ప్రభాస్-20 కొత్త షెడ్యూల్
బన్నీ చిత్రంలో విజయ్ సేతుపతి?
రవితేజ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?
రవితేజ కొత్త మూవీ #RT 66 వివరాలు
ఆఖరి షెడ్యూల్ లో 'ఎంత మంచివాడవురా'
ఫైనల్ గా థియేటర్స్ కు వస్తున్న 'అర్జున్ సురవరం'

నిశ్శబ్దం టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. నిన్న దీపావళి సందర్భంగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇంట్రస్టింగ్ థీమ్ మ్యూజిక్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్ ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ను చూపించిన విధానం బావుంది. ప్రీ టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.

త్వరలో సెట్స్ పైకి బన్నీ-సుకుమార్ మూవీ..!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో... ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను.. పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’, 'రాములో రాములా' పాటలను రిలీజ్ చేశారు.
హీరో కార్తీ ఖైదీ మూవీ సీక్వెల్ ఖైదీ 2
డ్రీమ్ వారియర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఖైదీ దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ 25 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించాయి. 60 రాత్రులలో షూటింగ్ జరుపుకున్న ఖైదీ మూవీ ప్రేక్షకుల, క్రిటిక్స్ ప్రశంసలు పొందింది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ రోల్ లో కార్తీ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేసి ప్రేక్షకులను, తన అభిమానులను ఆకట్టుకున్నారు.

దీపావళికి టాలీవుడ్ ట్రీట్
నిన్న దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ పెద్ద ట్రీటే ఇచ్చింది. పలు సినిమాలకు సంబంధించిన అప్ డేట్లు, ఫస్ట్ లుక్ లు, ట్రయిలర్ లు రిలీజ్ చేశారు. ఇక ఆ అప్ డేట్స్ ఏంటో ఒక లుక్కేద్దాం..
దర్బార్ మూవీ కొత్త పోస్టర్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన దర్బార్ మూవీ లో నయనతార కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నివేత థామస్ , ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
మోస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియన్ సాంగ్‌గా `రాములో రాములా`
`అల వైకుంఠపురములో`... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, సినిమా విడుదలకి ఇంకా సమయమున్నా చిత్ర యూనిట్ అప్పుడే ప్రచారపర్వానికి శ్రీకారం చుట్టింది. పాటలతో తమ చిత్రంపై అటెన్షన్ క్రియేట్ చేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మేలిమలుపు తిప్పిన `ఖైదీ`కి 36 ఏళ్ళు
నాలుగు దశాబ్దాల మెగాస్టార్ చిరంజీవి నటనాప్రస్థానంలో ఎన్నో బ్లాక్‌బస్టర్స్, మరెన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి. ఇక ఇండస్ట్రీ హిట్స్ సంగతి సరేసరి. అయితే, కథానాయకుడిగా చిరు దశను, దిశను మేలిమలుపు తిప్పిన చిత్రం మాత్రం ఒకటుంది. అదే... `ఖైదీ`. అంతకుముందు ఈ కొణిదెల `కొదమసింహం` నటించిన అరవై చిత్రాలు ఒకెత్తు అయితే, `ఖైదీ` మరో ఎత్తు. పగ, ప్రతీకారాలతో రగిలిపోయే సూర్యం పాత్రలో సూర్యుడిలా వెలిగిపోయారు ఈ నటశిఖరం. ఆపై తెలుగువారి గుండెల్లో అభిమానపాత్రుడైన `ఖైదీ`గా స్థిరపడిపోయారు. మొత్తమ్మీద... `ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి తరువాత అన్నంతగా చిరు కెరీర్‌పై ప్రభావం చూపింది ఈ…
కొరటాల దర్శకత్వంలో చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్?
గత ఏడాది `రంగస్థలం` రూపంలో సంచలన విజయం అందుకున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. అయితే, ఆ తరువాత వచ్చిన `వినయ విధేయ రామ` నిరాశపరిచినా... ఆరంభ వసూళ్ళ పరంగా చరణ్ స్టామినాని చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`లో... యంగ్ టైగర్ యన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఈ కొణిదెల వారి రెండో తరం కథానాయకుడు.
నవంబర్ నుంచి ప్రభాస్-20 కొత్త షెడ్యూల్
దాదాపు దశాబ్దం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఓ ప్రేమకథా చిత్రం వస్తోంది. అయితే.. రెగ్యులర్ లవ్ స్టోరీస్‌కి భిన్నంగా పిరియాడికల్ టచ్‌తో ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు ప్రభాస్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా.. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
బన్నీ చిత్రంలో విజయ్ సేతుపతి?
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా పలు విలక్షణ భూమికల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయ్. కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`తో తెలుగునాట గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సేతుపతి... ప్రస్తుతం చిరు మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిల్మ్ `ఉప్పెన`లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు... మరో మెగా కాంపౌండ్ హీరోతోనూ విజయ్ సేతుపతి కలసి నటించబోతున్నట్లు సమాచారం.
`ఆర్ ఆర్ ఆర్`, `లూసిఫర్`, `మెగాస్టార్ 152`పై క్లారిటీ ఇచ్చిన రామ్ చరణ్
ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ రాణిస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఏడాది `వినయ విధేయ రామ`తో హీరోగానూ, `సైరా నరసింహారెడ్డి`తో ప్రొడ్యూసర్‌గానూ రెండు విభిన్న ప్రయత్నాలతో పలకరించాడు ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు... ఒకవైపు `ఆర్ ఆర్ ఆర్` వంటి క్రేజీ మల్టీస్టారర్‌లో నటిస్తూనే, మరోవైపు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే మలయాళ బ్లాక్‌బస్టర్ `లూసిఫర్` రీమేక్ రైట్స్ సొంతం చేసుకుని చిరుతోనే ఆ సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా.... ఇటీవల ఈ మూడు సినిమాల(`ఆర్ ఆర్ ఆర్`…
రవితేజ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్?
`డాన్ శీను`, `బలుపు` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత బి. మధు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇందులో రవితేజ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అతనికి జోడీగా శ్రుతి హాసన్ నటించనుందని టాక్. కాగా... ఈ సినిమాకి `క్రాక్` అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ని పరిశీలిస్తున్నారని సమాచారం. కథానుసారం ఈ టైటిల్ అయితేనే యాప్ట్‌గా ఉంటుందని యూనిట్ భావిస్తోందట. త్వరలోనే టైటిల్‌కి సంబంధించి క్లారిటీ వచ్చే…
దర్శకరత్న దాసరి 100వ చిత్రం `లంకేశ్వరుడు`కి 30 ఏళ్ళు
దర్శకరత్న దాసరి నారాయణరావు... భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని సంతకం. అత్యధిక చిత్రాలను రూపొందించిన దర్శకుడిగా అనితరసాధ్యమైన రికార్డును తన సొంతం చేసుకున్నారు దాసరి. మొత్తంగా 151 సినిమాలను తెరకెక్కించి... ఆల్ టైమ్ సెన్సేషన్ క్రియేట్ చేశారాయన. అలాంటి దాసరి కెరీర్‌లో 100వ చిత్రంగా `లంకేశ్వరుడు`కి ప్రత్యేక స్థానముంది.
సరిలేరు నీకెవ్వరు నుండి మహేష్ పోస్టర్ రిలీజ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెంటర్ సెట్‌లో యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. తాజాగా విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ కోసం నవంబర్ 1 నుంచి జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చిత్రయూనిట్ కేరళకు వెళ్లనుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నట్టు సమాచారం.

బాలకృష్ణ 105 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇక ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనుండటంతో... చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు చిత్రయూనిట్.
అల్లు అర్జున్ వాయిస్ ఓవర్ తో రాములో రాములా సాంగ్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అల ... వైకుంఠపురములో ... మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. పూజ హెగ్డే కథానాయిక కాగా సుశాంత్, జయరామ్, టబు, నవదీప్ , నివేత పేతురాజ్ , సునీల్ ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.
రవితేజ కొత్త మూవీ #RT 66 వివరాలు
SRT ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మాస్ మహారాజా రవితేజ హీరోగా VI ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ , నభా నటేష్ కధానాయికలు. థమన్ S సంగీతం అందించారు. డిస్కో రాజా ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగల్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తనదైన స్టైల్ లో ప్రేక్షక, అభిమానులను అలరించే రవితేజ డిస్కో రాజా తరువాత తాను నటించే కొత్త మూవీ వివరాలు దీపావళి కానుకగా ప్రకటించారు.
ఆఖరి షెడ్యూల్ లో 'ఎంత మంచివాడవురా'
‘118’ ఘనవిజయం తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మూడో షెడ్యూలు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆఖరి షెడ్యూలుకు సిద్ధమవుతోంది. ఇక ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్ తదితర సుందరమైన ప్రదేశాల్లో ఈ నెల 31 నుంచి నవంబర్ 10 వరకూ షూట్ చేయనున్నారట. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారట.

'క్లాప్' ఆది పినిశెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్
కేవలం హీరోగా మాత్రమే కాదు విలన్ గా.. మరోపక్క సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు ఆది పినిశెట్టి. తను ప్రతి సినిమాకు ఓ విభిన్నత ఉండేలా చూసుకుంటాడు. ఇప్పుడు తాజాగా `క్లాప్` అనే మరో సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుది.
ఫైనల్ గా థియేటర్స్ కు వస్తున్న 'అర్జున్ సురవరం'
ఫైనల్లీ అర్జున్ సురవరం రిలీజ్ కు ముహర్తం కుదిరింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకొని అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. మొదట మే అన్నారు.. ఆతర్వాత మళ్ళీ మార్చారు.. ఇక ఆతర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇక ఇటీవలే ఈ సినిమా రిలీజ్ పై నిఖిల్ ఓ అప్ డేట్ ఇచ్చాడు.