85 ఏళ్ళ బామ్మ‌ పాత్ర‌లో కాజ‌ల్‌?

Kajal Plays 85 Year Old Woman Role in Shankar Bharateeyudu Movie,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Shankar Bharateeyudu Movie Updates,Kajal Plays 85 Year Old Woman Role,Actress Kajal Latest News 2019

పుష్క‌ర‌కాలంగా క‌థానాయిక‌గా రాణిస్తున్న వైనం కాజ‌ల్ అగ‌ర్వాల్ సొంతం. అందం, అభిన‌యం మెండుగా ఉన్న ఈ టాలీవుడ్ చంద‌మామ‌… ఇప్ప‌టివ‌ర‌కు `అమ్మ` పాత్ర‌ల్లో న‌టించిన సంద‌ర్భాలే లేవు. అలాంటిది.. ఓ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం కోసం ఏకంగా 85 ఏళ్ళ బామ్మ‌గా క‌నిపించ‌బోతోందట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాస్త వివ‌రాల్లోకి వెళితే… `భార‌తీయుడు` (1996)కి కొన‌సాగింపుగా లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్‌, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో `భార‌తీయుడు 2` రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తొలి భాగంలో సుక‌న్య పోషించిన అమృత‌వ‌ల్లి పాత్ర‌కి కొన‌సాగింపుగా కాజ‌ల్ పాత్ర ఉంటుంద‌ని స‌మాచారం. అంతేకాదు… 85 ఏళ్ళ వృద్ధురాలిగా ఈ పాత్ర‌ని డిజైన్ చేశార‌ట శంక‌ర్‌. ఈ నేప‌థ్యంలో… ప్రొస్థెటిక్ మేక‌ప్‌తో ఈ బామ్మ పాత్ర‌లో కాజ‌ల్ ద‌ర్శ‌న‌మిస్తుంద‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే… కాజ‌ల్ కెరీర్‌లోనే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ ఇద‌ని చెప్పొచ్చు. త్వ‌ర‌లోనే కాజ‌ల్ క్యారెక్ట‌ర్‌పై క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది.

ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించిన తాజా షెడ్యూల్ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోఫాల్‌లో జ‌రుగుతోంది. 90 ఏళ్ళ వృద్ధుడు సేనాప‌తి(తొలి భాగంలో తండ్రి పాత్ర‌)గా న‌టిస్తున్న క‌మ‌ల్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను అక్క‌డ‌ తెర‌కెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్ అనంత‌రం గ్వాలియ‌ర్‌, తైవాన్ లో త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేశారు శంక‌ర్‌.

కాగా… సిద్ధార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న `భార‌తీయుడు 2`కి అనిరుధ్ బాణీలు అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 + fourteen =