దర్శకధీరుడు యస్.యస్. రాజమౌళి తొలిసారి ఓ హిస్టారికల్ ఫిక్షన్ తెరకెక్కిస్తున్నారు. ఆ చిత్రమే… `ఆర్ ఆర్ ఆర్`. ఇద్దరు తెలుగు పోరాట యోధుల (అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్) జీవితాల్ని మిళితం చేస్తూ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు జక్కన్న. 1920 నేపథ్యంలో సాగే ఈ పిరియాడికల్ డ్రామాలో కొమరం భీమ్‌గా యంగ్ టైగర్ యన్టీఆర్ నటిస్తుంటే… అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన సింహభాగం చిత్రీకరణ పూర్తయ్యిందని సమాచారం. కాగా… తాజా షెడ్యూల్‌ని సోమవారం నుండి హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారని టాక్. ఈ షెడ్యూల్లో తారక్, చరణ్ కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారట రాజమౌళి. ఈ దృశ్యాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… 2020 జూలై 30న థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: