ప్రకాష్ రాజ్ కు బాలయ్య టెక్నీషియన్ స్ట్రాంగ్ రిప్లై

Balakrishna Technician strong reply to Prakash raj,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ruler Technician strong reply to Prakash raj,Balakrishna Ruler Latest News

ప్రకాష్ రాజ్ లాంటి నటులు సినీ పరిశ్రమకు దొరకడం ఒకింత అదృష్టమనే చెప్పొచ్చు. విలన్ పాత్రలు కానీ.. బొమ్మరిల్లు లాంటి తండ్రి పాత్ర అయినా.. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో రేలంగి మావయ్య లాంటి పాత్ర అయినా సరే ప్రకాష్ రాజ్ ముందు తేలిపోవాల్సిందే. ఏ పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి నటనకు జీవం పోస్తాడు. భారతీయ సినీ ప్రపంచంలో ఉన్న గొప్ప నటుల్లో ప్రకాష్ రాజ్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇదంతా నాణానికి ఒక కోణం అయితే మరో కోణం కూడా ఉంటుంది. అలానే ప్రకాష్ రాజ్ కూడా గొప్ప నటుడే కానీ.. షూటింగుల్లో అయన చేసే బిహేవియర్ పై చాలా కంప్లైట్స్ ఉన్నాయి. ఇక కొన్ని ఇండస్ట్రీస్ అయితే ఆయనకు బ్యాన్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. తన ప్రవర్తన వల్ల సినిమా ఛాన్స్ లు కూడా తగ్గిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ వాస్తవాలను తెలుసుకొని రాజీ పడి సినిమా షూటింగ్ చేసిన రోజులు ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా మరోసారి ప్రకాష్ రాజ్ తన పాత యాంగిల్ ను బయటకు తీసుకొచ్చాడు. బాలకృష్ణ హీరోగా కే.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్, భూమికలపై ఓ సీన్ చిత్రీకరిస్తున్నారట. అయితే భూమిక ఇంకా తన సీన్ రిహార్సల్ చేస్తుండటంతో అసహనానికి గురైన ప్రకాష్ రాజ్ అన్ని ఓకే అయిన తర్వాత నన్ను పిలవాలి.. అని గట్టిగా అరిచేశాడంట.

దేనితో ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ రామ్ ప్రసాద్ ‘నీ ఇల్లు కాదు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఇది షూటింగ్’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చాడట. ఆశర్యం ఏంటంటే రామ్ ప్రసాద్ అరిచినందుకు ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతాడా అని అనుకున్నారు కానీ నార్మల్ గానే ఉండి షూటింగ్ లో పాల్గొన్నాడట. మొత్తానికి ప్రకాష్ రాజ్ కు అర్థమైనట్టుంది. తన కోపం వల్ల తన కెరీర్ నాశనం అవుతుందని..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here