విజేత చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్. అయితే మొదటి సినిమా అంత సక్సెస్ కాలేదనే చెప్పొచ్చు. అయితే కల్యాణ్ దేవ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అంతే కాదు సైమా అవార్డుల్లో బెస్ట్ డెబ్యూ యాక్టర్ గా పురస్కారం కూడా అందుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు రెండో సినిమాకు సిద్దమయ్యాడు కళ్యాణ్ దేవ్. ఇక ఈ సినిమాకు సంబంధించి అజా అప్డేట్ ఇచ్చాడు కళ్యాణ్ దేవ్ తన ట్విట్టర్ ద్వారా. ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేస్తున్నామని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ లో తెలిపారు. రిజ్వాన్ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు టీవీ సీరియళ్ల దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
మరి గతకొద్ది కాలంగా ఈ సినిమా టైటిల్ ‘కండోమ్ ఫ్యాక్టరీ’ అని వినిపిస్తుంది. మరి తాజాగా ప్రకటించబోయే చిత్రం ఇదేనా? కాదా? అన్నది తెలియాలంటే రేపటివరకూ ఆగాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: