ఖైదీ మూవీ తెలుగు రివ్యూ – బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్

‘మా న‌గ‌రం’ ఫేమ్ లోకేష్ క‌న‌గ‌రాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో తెర‌కెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోనే అంచనాలు భారీగా పెంచేసింది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆ అంచనాలను రీచ్ అయిందో..?లేదో..? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు : కార్తీ, నరైన్,రమణ, దీనా తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనకరాజ్
నిర్మాత‌లు : ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు, తిరుప్పూర్ వివేక్
సంగీతం : శ్యామ్ సీఎస్
సినిమాటోగ్రఫర్ : సత్యన్ సూర్యన్

కథ:

ఢిల్లీ (కార్తీ) జీవిత ఖైదు చేయబడిన ఖైదీ. అయితే తన సత్ప్రవర్తన వల్ల ఖైదు తగ్గి బయటకివస్తాడు. బయటకు వచ్చిన వెంటనే తన కూతుర్ని చూడటానికి వెళ్తాడు. అదే టైంలో 800 కోట్ల విలువగల డ్రగ్స్ పోలీసుల నుండి కొందరు రౌడీలు కాజేస్తారు. వారిని పట్టుకోవడం పోలీసులవల్ల కాక.. ఢిల్లీ ను సపోర్ట్ కోరతారు. మరి ఢిల్లీ పోలీసులకి సపోర్ట్ చేస్తాడా? ఇంతకీ ఢిల్లి ఎందుకు జైలుకి వెళ్లాడు..? ఆఖరికి తన కూతుర్ని చూడాలన్న కోరిక తీరుతుందా..? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి ఇలాంటి సినిమాలు ప్రేక్షకులకు నచ్చాలంటే కథ ఎంతో బలంగా ఉంటే కానీ కుదరదు. అందుకే కేవలం కథను మాత్రమే నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు లోకేష్ కనకరాజ్. సినిమా కథ, కథనాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రతిభ చాటాడు. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాడు.

ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు, హీరోయిన్ లేకపోవడం కూడా ఒక ప్లస్ పాయింట్స్. అవి ఉన్నా సినిమాకు మైనస్ అయ్యేవి తప్పా.. ఏమాత్రం ఉపాయాగపడేవి కాదు. అనవసరపు సన్నివేశాలను ఇరికించకుండా కథకు అనుగుణంగా సినిమా మొదటి ఫ్రేమ్‌ నుండి చివరి ఫ్రేమ్‌ వరకూ దర్శకుడు సినిమాని బాగా నడిపాడు. అంతకుమించిన కథ ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సెస్ ఈ సినిమాకు ప్రధానమైన బలాలు. కేవలం కథ డిమాండ్‌ మేర సన్నివేశాలను రాసుకున్న దర్శకుడు లోకేష్‌ డెడికేషన్‌ ను మెచ్చుకోవాల్సిందే. బలమైన యాక్షన్ అండ్ ఎమోషన్ తో పాటు కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ తో చాల వరకూ ఇంట్రస్టింగ్ గా సాగుతూ ఆకట్టుకుంటుంది.

ఇక కార్తీ, ఖైదీ పాత్రలో అద్భుతంగా నటించారు. ఢిల్లి పాత్రలో తన కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కార్తి. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కూతురు మీద ప్రేమను వ్యక్త పరిచే సన్నివేశంలో అలాగే తన గతం వివరించే సీన్ లో మరియు కూతుర్ని కలుసుకునే సీన్ లో కార్తీ నటన ఎమోషనల్ గా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.ముఖ్యంగా క్లైమాక్స్‌లో కూతురి చూసినప్పుడు కార్తి నటన ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమా కార్తి వన్ మ్యాన్ షో.

సత్యన్ సూరియన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. అతని కెమెరా వర్క్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమాను మొత్తం 60 రాత్రుల్లో చిత్రీకరించారు. చీకటిలోనే అయినప్పటికీ లైటింగ్ ఎఫెక్ట్‌తో అద్భుతంగా తెరకెక్కించారు. రాత్రి పూట అడవిలో లారీలో ప్రయాణం చేసే సన్నివేశాలను సత్యన్ సూర్యన్ తన కెమెరాలో అద్భుతంగా బంధించారు. సాం సిఎస్ మ్యూజిక్ బిజిఎం ఆకట్టుకుంది. సినిమా మూడ్ ను బట్టి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.

ఓవరాల్ గా చెప్పాలంటే మంచి యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. రెగ్యులర్ సినిమాలకు కాస్త భిన్నంగా ఉండే ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఖైదీ మూవీ తెలుగు రివ్యూ - బెస్ట్ యాక్షన్ థ్రిల్లర్
  • Story
  • Screenplay
  • Direction
  • Performance
3.5

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =