విక్టరీ వెంకటేష్ పలు రీమేక్ చిత్రాల్లో సందడి చేశారు. వీటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. కాగా… `గురు`(2017) తరువాత మరో రీమేక్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వెంకీ. అదే… తమిళ చిత్రం `అసురన్`. ధనుష్ కథానాయకుడిగా నటించిన ఈ విలేజ్ డ్రామా తమిళనాట వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అక్టోబర్ 4న రిలీజైన ఈ సెన్సేషనల్ మూవీని వెట్రిమారన్ డైరెక్ట్ చేయగా… కలైపులి థాను నిర్మించారు. ఇక తెలుగు వెర్షన్‌ని డి.సురేష్ బాబుతో పాటు మాతృక నిర్మాత కలైపులి థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని సురేష్ ప్రొడక్షన్ సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. వెంకటేష్ కెరీర్‌లో 74వ చిత్రంగా తెరపైకి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ప్రస్తుతం వెంకీ తన మేనల్లుడు నాగచైతన్యతో కలసి `వెంకీమామ`లో నటిస్తున్నారు. త్వరలోనే ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































