తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా తమిళంలో వచ్చిన ‘అసురన్’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 150 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాదు వెంకటేష్ ఈ రీమేక్ ను చేస్తున్నట్టు టాలీవుడ్ లో ఒకటే వార్తలు చక్కర్లు కొట్టాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Another proud and special moment for Asuran#venkateshbabu #sureshBabu
Asuran remake in Telugu with Venkatesh Babu sir and Suresh production. pic.twitter.com/OaP1HHgm7V— Kalaippuli S Thanu (@theVcreations) October 25, 2019
అయితే ఇప్పుడు ఈ రీమేక్ పై క్లారిటీ వచ్చేసింది. అసురన్ ను రీమేక్ చేస్తున్నట్టు అందులో వెంకీ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అసురన్ తెలుగు వర్షన్‌ను సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థల్లో సురేష్ బాబు, కళైపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అతి త్వరలో చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియజేయనున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: