విజిల్ మూవీ రివ్యూ – విజయ్ ఫ్యాన్స్ కు ఫుల్ మీల్సే

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’. ఇక ‘విజిల్’ అనే పేరుతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మించగా.. తెలుగులో ఈ ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌ అధినేతలు రిలీజ్ చేశారు. మరి ఈరోజు విడుదలైన ఈ సినిమా హిట్ అయ్యిందా..? తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) సినిమాలతో రెండు హిట్ లు కొట్టిన వీళ్లు.. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారా..లేదా..? అన్నది తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటీనటులు: విజయ్, నయనతార, వివేక్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, యోగిబాబు, డేనియల్ బాలాజీ, అనంత్‌రాజ్ తదితరులు
దర్శకత్వం: అట్లీ
నిర్మాత‌లు: కళపతి ఎస్ అఘోరం
సంగీతం: ఏఆర్ రహ్మాన్

కథ:

రాయప్పన్ (విజయ్) ఒక మంచి గ్యాంగ్‌స్టర్‌. పేదవారికి సహాయం చేస్తుంటాడు అందరికీ. తన కొడుకు మైఖేల్ అలియాస్ విజిల్‌ను (విజయ్) జాతీయ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా చూడాలన్నది రాయప్పన్ ఆశయం. తండ్రి కోరిక మేరకు ఫుట్‌బాల్ నేషనల్ ఛాంపియన్‌ఫిప్‌లో పాల్గొనడానికి వెళ్లగా.. ఆ సమయంలో రాయప్పన్ హత్యకు గురవుతాడు. తన తండ్రి చంపడంతో ఆ స్థానంలోకి వస్తాడు మైఖేల్. అప్పుడే ఫుట్ బాల్ లేడీ టీం కోచ్ అయిన మైకేల్ మిత్రుడు కూడా చనిపోతాడు. ఆ పరిస్థితుల నేపథ్యంలో లేడీ ఫుట్ బాల్ టీం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది. మరి కోచ్ గా బాధ్యతలు తీసుకున్న మైఖేల్ మహిళా జట్టును ఎలా తీర్చిదిద్దాడు..? లక్ష్య సాధనలో తనకు ఎదురైన ఇబ్బందులు ఏంటి..? తన తండ్రిని చంపిన వాళ్లపై మైఖేల్ ఎలా పగ తీర్చుకున్నాడు..అతని సారథ్యంలోని ఫుట్ బాల్ టీం లక్ష్యం సాధించిందా? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

నిజానికి స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఫుట్ బాల నేపథ్యంలో సినిమాలు మాత్రం సినిమా మాత్రం ఇదే. ఇక ఈ సినిమాపై పెంచుకున్న అంచనాలకు తగ్గట్టుగానే అట్లీ విజయ్ తో వేరో లెవల్లో పెర్ఫార్మన్స్ చేయించాడు. ఇక అట్లీ గురించి చెప్పుకోవాలనుంటే అట్లీ ఇప్పటిదాకా చేసినవి నాలుగు సినిమాలు. అందులో విజయ్ తోనే ఇది మూడో సినిమా. కాబట్టి విజయ్ ను ఎలా చూపించాలో.. ఎలా చూపిస్తే ఫాన్స్ కు నచ్చుతాడో తెలుసు కాబట్టి అలానే అట్లీ విజయ్ ను చూపించాడు. అది విజిల్ లో అడుగుగడుగునా కనిపిస్తుంది. స్టోరీ చాలా చిన్నగా ఉన్న ఈ చిత్రాన్ని అట్లీ నడిపించిన తీరు ఫ్యాన్స్ కు అయితే ఫుల్ మీల్స్ తరహాలో ఉంటుంది.

మూడు గెటప్పుల్లోనూ చక్కగా నటించడమే కాకుండా..త్రీ వేరియేషన్స్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు విజయ్. అయితే మూడింట్లో ఎక్కువగా ఆకట్టుకునే పాత్ర రాజప్ప అని చెప్పొచ్చు. సినిమాను రాజప్ప క్యారెక్టర్ వేరే లెవెల్ కు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది.

ఫస్ట్ హాఫ్ మొత్తం మురికివాడలో రాయప్పన్ గ్యాంగ్‌వార్, విజిల్-ఏంజెల్ (నయనతార)నడుమ ప్రేమాయణం నేపథ్యంలో సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కోచ్‌గా విజిల్ యువతుల్ని ఎలా విజేతలుగా తీర్చిదిద్దాడమే అంశంపై దృష్టిపెట్టారు. ఫుట్‌బాల్ అంటే ఆసక్తి వుండి సరైన ఆర్థిక స్థోమత లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతుల కోసం విజిల్ ఓ అకాడమీ స్థాపించడం..వారిని సుశిక్షితులుగా తీర్చిదిద్దడం..ఈ నేపథ్యంలో చక్కటి ఎమోషనల్ డ్రామా పండింది. యాసిడ్ దాడికి గురైన యువతిలో స్ఫూర్తినింపి ఆమెను ఫైనల్ పాల్గొనడానికి కోచ్ విజిల్ ప్రేరేపించి ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది.

నయనతార ఉన్నంతలో బాగా చేసింది. అయితే ఆపాత్రకు నయనతార కాకపోయినా వేరే హీరోయిన్ అయినా పర్వాలేదనిపిస్తుంది. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. ఇక కథిర్, యోగి బాబు తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా యోగి బాబు పాత్ర కామెడీ నవ్వులు తెప్పిస్తుంది. నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్ ఇద్దరికీ లిమిటెడ్ పాత్రలు దక్కాయి. ఉన్నంతలో వారు పర్వాలేదు. మిగిలిన వారు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఇక ఏఆర్ రహ్మాన్ సంగీతం బావుంది. పాటలు అంతగా మెప్పించకపోయినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. ఎక్కడ ఏ సీన్ దగ్గర ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో.. రెహ్మాన్ అలంటి మ్యూజిక్ ఇచ్చి ప్రతి సీన్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుందంటే అది కచ్చితంగా సినిమాటోగ్రాఫర్ ప్రతిభే. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్.విజిల్ మూవీలో వి ఎఫ్ ఎక్స్ వర్క్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ చూస్తున్న భావన ప్రేక్షకుడికి కలిగేలా వారు చేయడం విజయం సాధించారు. ఫుట్ బాల్ మ్యాచ్ లలో జరిగే ఉత్కంఠ రేపే సన్నివేశాలను వాస్తవానికి దగ్గరగా తెరపై ఆవిష్కరించడంలో వి ఎఫ్ ఎక్స్ బాగా ఉపయోగపడింది.

ఓవరాల్ గా చెప్పాలంటే ఒకసారి చూడదగ్గ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ విజిల్ అని చెప్పొచ్చు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × two =