ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 5
'V' మనాలి షెడ్యూల్ పూర్తి
ఉపేంద్ర "కబ్జ" మూవీ త్వరలో ప్రారంభం

" మత్తు వదలరా "మూవీ పై ప్రభాస్ ప్రశంసలు
ఒకే నెలలో రెండు సూపర్ హిట్ మూవీస్
తనికెళ్ళ భరణి దర్శకత్వంలో 'అమ్మ బ్రతికే ఉంది'
హీరో సిద్ధార్థ్ కు జోడీ గా నివేత థామస్
గోపీచంద్ 28 వ మూవీ టైటిల్ "సీటీమార్ "?

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సత్య దేవ్

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్
ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ దూకుడు
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?
చిరంజీవి - కొరటాల మూవీ షూటింగ్ అప్ డేట్

" HIT " మూవీ ఫస్ట్ లుక్ విడుదల
అభిమానులకు చిరు , చెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు
'వెంకీమామ' మామఅల్లుళ్ళ విజయ విహారం
బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్ దాదాపు రెండు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. ఇప్పటికే ఈసినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరువైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 72 కోట్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఇప్పటివరకూ ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.
'V' మనాలి షెడ్యూల్ పూర్తి
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'V'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే మనాలిలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం అక్కడ షూటింగ్ పూర్తి చేశారట. మనాలిలో గడ్డ కట్టించే చలిలో సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
ఉపేంద్ర "కబ్జ" మూవీ త్వరలో ప్రారంభం
దర్శకుడు ఆర్ .చంద్రు స్వంత బ్యానర్ శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పై ఆర్.చంద్రు దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా 80ల నాటి అండర్ వరల్డ్ డాన్ నేపథ్యంలో రూపొందనున్న "కబ్జ" కన్నడ మూవీ నవంబర్ లో పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ఉపేంద్ర అండర్ వరల్డ్ డాన్ గా నటించనున్న "కబ్జ" మూవీ షూటింగ్ జనవరి 2వ తేదీ రామోజీ ఫిల్మ్ సిటీ , హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

" మత్తు వదలరా "మూవీ పై ప్రభాస్ ప్రశంసలు
మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "మత్తు వదలరా "మూవీ విజయం సాధించింది. అంతా కొత్తవారితో రూపొందిన ఈ మూవీ తో కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం " మత్తు వదలరా "మూవీ కి హై లైట్ గా నిలిచింది.
లేటెస్ట్ మూవీస్ వైజాగ్ కలెక్షన్స్
ఈ ఏడాది చివరి నెల కావడంతో పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగాయి. ఒక వారం అటూ.. ఇటూగా చాలా సినిమాలే ఈ నెలలో రిలీజ్ అయ్యాయి. గత వారం నాలుగు సినిమాలు రిలీజ్ అవ్వగా.. నిన్న రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరి ఈ లేటెస్ట్ సినిమాల వైజాగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
ఒకే నెలలో రెండు సూపర్ హిట్ మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ "ఊహలు గుస గుస లాడే " తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన అందాల రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్ , జై లవకుశ , రాజా ది గ్రేట్ , తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ "ఇమైక్క నోడిగళ్ " మూవీ లో నటించి అక్కడ రాశీ ఖన్నా బిజీగా మారారు.
తనికెళ్ళ భరణి దర్శకత్వంలో 'అమ్మ బ్రతికే ఉంది'
కేవలం రచయిత గానే కాకుండా..నటుడిగా కూడా సినిమాల్లో తన సత్తా చాటారు తనికెళ్ళ భరణి. అంతేకాదు దర్శకుడిగా కూడా మారి మిథునం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పుడు మరోసారి దర్శకుడిగా అవతారం ఎత్తనున్నారు. గతకొద్ది కాలంగా భరణి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శర్వానంద్ తో అనుకున్న ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత సునీల్ తో మరో సినిమా అనుకున్నారు. కానీ అదీ వర్కౌట్ కాలేదు.
హీరో సిద్ధార్థ్ కు జోడీ గా నివేత థామస్
కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న నివేత థామస్ సూపర్ హిట్ "జెంటిల్ మన్ " మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు. నివేత నటించిన నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా మూవీస్ ఘనవిజయం సాధించాయి. నివేత ప్రస్తుతం "V" మూవీ లో నటిస్తున్నారు. "పింక్ " రీమేక్ మూవీ కి ఎంపికయ్యారు. సిద్దార్థ్ హీరోగా రూపొందనున్న తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
గోపీచంద్ 28 వ మూవీ టైటిల్ "సీటీమార్ "?
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వం లో యాక్షన్ హీరో గోపీచంద్, తమన్నా జంటగా గోపీచంద్ 28 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో గోపీచంద్ ఆంధ్ర ప్రదేశ్ మహిళా కబడ్డీ కోచ్,తమన్నా తెలంగాణ మహిళా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.

మరో క్రేజీ ప్రాజెక్ట్ లో సత్య దేవ్
మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఇటీవలే జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్ తాజాగా మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు.
డిజిటల్ వరల్డ్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఎంట్రీ
వెబ్ సిరీస్ కు ప్రేక్షకాదరణ పెరుగుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ సమంత, కాజల్ అగర్వాల్, తమన్నా వెబ్ సిరీస్ ల ను ఓకే చేశారు. లెజెండరీ పొలిటికల్ లీడర్ జయలలిత బయోపిక్ వెబ్ సిరీస్ "క్వీన్ " లో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటించారు. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అమెజాన్ ప్రైమ్ నిర్మించే వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్
విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ పెద్దగా ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్

భీష్మ నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ ప్రోమో
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ కోసం రోమ్ వెళ్ళింది చిత్రయూనిట్. ఈ పాటల షూటింగ్ పూర్తయితే సినిమా షూటింగ్ పూర్తయినట్టే.
`కార్తికేయ` సీక్వెల్ లో టీవీ రిపోర్టర్ గా స్వాతి?
2014 నాటి డివోషనల్ థ్రిల్లర్ `కార్తికేయ`కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగంలో కథానాయకుడిగా నటించిన నిఖిల్ ఇందులోనూ హీరోగా నటిస్తున్నాడు. అలాగే `కార్తికేయ`కి దర్శకత్వం వహించిన చందు మొండేటినే ఈ సీక్వెల్ ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అంతేకాదు.. అందులో నాయికగా నటించిన స్వాతి కూడా ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో దర్శనమిస్తుందట. వినిపిస్తున్న కథనాల ప్రకారం... ఇందులో స్వాతి టీవీ రిపోర్టర్ రోల్ లో కనిపిస్తుందని, కథను కీలక మలుపు తిప్పే పాత్ర ఇదని తెలిసింది. మరి... టీవీ రిపోర్టర్ పాత్రలో స్వాతి ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ దేవరకొండ దూకుడు
తెలుగునాట అనతి కాలంలోనే `యూత్ ఐకాన్`గా ఎదిగాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలతోనే కాదు... తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తోనూ, స్టైల్ ఫ్యాక్టర్ తోనూ యూత్ ని ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తున్నాడీ బ్యాంకబుల్ హీరో. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుపోతున్న ఈ టాలెంటెడ్ స్టార్... సోషల్ మీడియాలోనూ తనదైన హవా చాటుకుంటున్నాడు.
శర్వానంద్ తో అజయ్ భూపతి `మహాసముద్రం`?
గత ఏడాది సంచలనం `ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగు వేశాడు అజయ్ భూపతి. ఆ సినిమా విడుదలై ఏడాది దాటినా రెండో చిత్రం పట్టాలెక్కలేదు. వాస్తవానికి, `మహాసముద్రం` పేరుతో ఓ మల్టీస్టారర్ ని చేయాలని అజయ్ భావించాడు. అయితే, పలు కారణాల వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ యాక్షన్ ఫిల్మ్ సెట్స్ పైకి వెళ్ళబోతోందని సమాచారం.
చిరంజీవి - కొరటాల మూవీ షూటింగ్ అప్ డేట్
ఈ ఏడాది కాస్ట్యూమ్ డ్రామా `సైరా నరసింహారెడ్డి` రూపంలో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి... ప్రస్తుతం ఓ సోషల్ డ్రామా చేస్తున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, `మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్` నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
`పండగ చేస్కో` హీరోతో `ప్రతి రోజూ పండగే` దర్శకుడి చిత్రం?
రీసెంట్ గా రిలీజైన `ప్రతి రోజూ పండగే`తో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి. ఒకవైపు ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే... మరోవైపు కొత్త సినిమాకి సన్నద్ధమవుతున్నాడు. వినిపిస్తున్న కథనాల ప్రకారం... మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ యువ కథానాయకుడు రామ్ తో ఉండొచ్చని తెలిసింది. ఇప్పటికే ఈ మేరకు రామ్, మారుతి మధ్య చర్చలు జరిగాయని, అన్నీ కుదిరితే 2020 వేసవిలో ఈ సినిమా పట్టాలెక్కవచ్చని వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి... `పండగ చేస్కో` కథానాయకుడితో `ప్రతి రోజూ పండగే` దర్శకుడు చేయనున్న ఈ…

" HIT " మూవీ ఫస్ట్ లుక్ విడుదల
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై Dr శైలేష్ కొలను దర్శకత్వంలో , "ఈ నగరానికి ఏమైంది ", "ఫలక్ నుమా దాస్ " మూవీస్ ఫేమ్ విశ్వక్ సేన్ , రుహానీ శర్మ జంటగా మెడికల్ థ్రిల్లర్ ది ఫస్ట్ కేస్ ట్యాగ్ లైన్ తో " HIT " మూవీ రూపొందుతుంది. ఈ మూవీ కి తిపిర్నేని ప్రశాంతి నిర్మాత. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
అభిమానులకు చిరు , చెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు
మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ తో పాటు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. మెగా స్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. ప్రతీ ఒక్కరికీ మెర్రీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం ప్రతీ ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, మా కుటుంబం తరఫున మనస్ఫూర్తిగా కోరు కుంటున్నా అన్నారు.