‘వెంకీమామ’ మామఅల్లుళ్ళ విజయ విహారం

Venky Mama Continues Its Success Spree With House Full Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Venky Mama Collections,Venky Mama Movie Collections,Venky Mama Telugu Movie Collections,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ ‘వెంకీమామ’. ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్‌ దాదాపు రెండు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్‌, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. ఇప్పటికే ఈసినిమా బ్రేక్‌ ఈవెన్‌కు చేరువైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 72 కోట్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఇప్పటివరకూ ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా వెంకటేష్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌, నాగచైతన్య సరసన రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో కామెడీ, సెంటిమెంట్‌లు బాగా వర్క్‌ అవుట్‌ అయ్యాయి. ముఖ్యంగా మామా అల్లుళ్లుగా వెంకటేష్‌, నాగచైతన్యలు తెర మీద సూపర్బ్ అనిపించారు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు థ‌మ‌న్ సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =