`పండ‌గ చేస్కో` హీరోతో `ప్ర‌తి రోజూ పండ‌గే` ద‌ర్శ‌కుడి చిత్రం?

Prati Roju Pandaage Movie Director Plans A New Movie With iSmart Star Ram Pothineni

రీసెంట్ గా రిలీజైన `ప్ర‌తి రోజూ పండ‌గే`తో మ‌రో హిట్ ని త‌న ఖాతాలో వేసుకున్నాడు టాలెంటెడ్ డైరెక్ట‌ర్ మారుతి. ఒకవైపు ఈ విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే… మ‌రోవైపు కొత్త సినిమాకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నాడు. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… మారుతి నెక్స్ట్ ప్రాజెక్ట్ యువ క‌థానాయ‌కుడు రామ్ తో ఉండొచ్చ‌ని తెలిసింది. ఇప్ప‌టికే ఈ మేర‌కు రామ్, మారుతి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని, అన్నీ కుదిరితే 2020 వేస‌విలో ఈ సినిమా ప‌ట్టాలెక్క‌వ‌చ్చ‌ని వినిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రింత‌ క్లారిటీ వచ్చే అవ‌కాశ‌ముంది. మ‌రి… `పండ‌గ చేస్కో` క‌థానాయ‌కుడితో `ప్ర‌తి రోజూ పండ‌గే` ద‌ర్శ‌కుడు చేయనున్న ఈ ప్ర‌య‌త్నం ప్రేక్ష‌కుల‌ను ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం రామ్… యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `రెడ్`లో న‌టిస్తున్నాడు. కిషోర్ తిరుమ‌ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 9న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − nine =