మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ “మత్తు వదలరా “మూవీ విజయం సాధించింది. అంతా కొత్తవారితో రూపొందిన ఈ మూవీ తో కీరవాణి తనయుడు, గాయకుడు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం ” మత్తు వదలరా “మూవీ కి హై లైట్ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాజిటివ్ రివ్యూస్ తో దిగ్విజయంగా ప్రదర్శించ బడుతున్న ” మత్తు వదలరా “మూవీ పై దర్శక ధీర రాజమౌళి ప్రశంసలు కురిపించారు. “మత్తు వదలరా “మూవీ మంచి వినోదభరిత చిత్రమని, సింహా, కాలభైరవ లను చూసి గర్వపడుతున్నానని, దర్శకుడు రితేష్ రానా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని రాజమౌళి ట్వీట్ చేశారు. ” మత్తు వదలరా “మూవీ పై ప్రభాస్ ఫేస్ బుక్ ద్వారా తన స్పందన తెలియజేశారు. “నా సింహా, భైరి అభినందనలు , ” మత్తు వదలరా “మూవీ విజయం సాధించిందన్న వార్త నాకు చాలా ఆనందం కలిగించిందని, మూవీ చూడకుండా వెయిట్ చేయలేకపోతున్నా ” అంటూ ప్రభాస్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: