కేవలం రచయిత గానే కాకుండా..నటుడిగా కూడా సినిమాల్లో తన సత్తా చాటారు తనికెళ్ళ భరణి. అంతేకాదు దర్శకుడిగా కూడా మారి మిథునం చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇప్పుడు మరోసారి దర్శకుడిగా అవతారం ఎత్తనున్నారు. గతకొద్ది కాలంగా భరణి దర్శకత్వంలో సినిమా రాబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శర్వానంద్ తో అనుకున్న ప్రాజెక్టు ఆగిపోయింది. ఆ తర్వాత సునీల్ తో మరో సినిమా అనుకున్నారు. కానీ అదీ వర్కౌట్ కాలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు ఫైనల్ గా కథ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. షావుకారు జానకి ప్రధాన పాత్రలో ‘అమ్మ బ్రతికే ఉంది’ టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. పూర్తిగా తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా సాగుతుందట. చాలా తక్కువ బడ్జెట్ లో కొత్త వారితో ఈ సినిమా తెరకెక్కించనున్నారట భరణి. అంతేకాదు తాను కూడా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్నాడట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే… ఈ సినిమాకు భరణినేనిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: