కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్

Different Title For Vikram New Movie

విక్రమ్ కొత్త సినిమాకు డిఫరెంట్ టైటిల్

Different Title For Vikram New Movie

Different Title For Vikram New Movie

విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. అయితే ‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్ హీరోగా చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమైనా ఏ ఒక్కటీ పెద్దగా ఆకట్టుకోలేదు. కిందటేడాది వచ్చిన ‘స్కెచ్’, ‘సామీ 2’ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఈసారి మాత్రం ఒక వెరైటీ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు విక్రమ్

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ తన 58వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఈ సినిమాకు ‘కోబ్రా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటమే కాకుండా.. భయపెడుతోంది కూడా. పోస్టరే ఇలా ఉంటే మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.

కాగా శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. 7 స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్