మొదటి నుండి ప్రత్యేకమైన పాత్రలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సత్య దేవ్. ఇటీవలే జార్జిరెడ్డి సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సత్యదేవ్ తాజాగా మరో కొత్త సినిమాను లైన్లో పెట్టాడు. ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. కేరాఫ్ కంచరపాలెం లాంటి అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన వెంకటేశ్ మహా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. బాహుబలి లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు ఈ సినిమాను తీస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేసారు చిత్రయూనిట్. ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ తమ ట్విటర్ ద్వారా ఈ వీడియో విడుదల చేసింది. బాధలో ఉన్న సత్యదేవ్‌కు నరేశ్ చెప్పులేసుకో అని చెబుతుండగా..తిరిగి వాడిని కొట్టేంతరకు చెప్పులేసుకోను అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్స్‌తో సాగే వీడియో ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెస్తుంది.
We are happy to announce our collaboration with director @mahaisnotanoun for our film #UmaMaheshwaraUgraRoopasya in collaboration with Mahayana Motion Pictures… @ActorSatyadev is the lead! #UMUR Announcement Video – https://t.co/XDcDLBjY3G @Shobu_ @ItsActorNaresh @appunitc
— Arka Mediaworks (@arkamediaworks) December 25, 2019
కాగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 17న విడుదల కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: