మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘V’. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే మనాలిలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం అక్కడ షూటింగ్ పూర్తి చేశారట. మనాలిలో గడ్డ కట్టించే చలిలో సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Sub-zero temperatures. Slippery rocks. Risky stunts. Yet, undaunted spirits. Thank you my team👏 Proud and grateful. MANALI SCHEDULE WRAPPED👏😎 @VTheMovie @SVC_official @NameisNani @i_nivethathomas @isudheerbabu @aditiraohydari @pgvinda pic.twitter.com/wXEAtwUhMp
— Mohan Indraganti (@mokris_1772) December 25, 2019
కాగా ఈ సినిమాలో నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా నటిస్తుండగా.. సుధీర్ బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు ఫస్ట్ టైమ్ నాని నెగటివ్ రోల్ లో నటించడం విశేషం. మరి చూద్దాం నాని నెగెటివ్ పాత్రలో ఎలా మెప్పిస్తాడో..!
మరి ఇంద్రగంటి, నాని కాంబినేషన్ లో ‘అష్టాచెమ్మా’, ‘జెంటిల్‌మన్’ అనే హిట్ సినిమాలు రాగా అవి హిట్ అయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడో సినిమా వస్తుంది. మరి ఈ సినిమా కూడా హిట్ అయి హ్యాట్రిక్ కొడతారేమో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: