తెలుగునాట అనతి కాలంలోనే `యూత్ ఐకాన్`గా ఎదిగాడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ. కేవలం సినిమాలతోనే కాదు… తన ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ తోనూ, స్టైల్ ఫ్యాక్టర్ తోనూ యూత్ ని ఎప్పటికప్పుడు ఎట్రాక్ట్ చేస్తున్నాడీ బ్యాంకబుల్ హీరో. సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుపోతున్న ఈ టాలెంటెడ్ స్టార్… సోషల్ మీడియాలోనూ తనదైన హవా చాటుకుంటున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముఖ్యంగా… ఇన్ స్టా గ్రామ్ లో విజయ్ కున్న ఫాలోయింగ్ ని చూస్తే ఎవరైనా షాక్ కి గురవ్వాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కంటే మిన్నగా ఇన్ స్టాలో విజయ్ కి ఫాలోవర్స్ ఉన్నారు. విజయ్ కి 5.1 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవర్స్ ఉంటే… ఆ తరువాతి స్థానాల్లో బన్నీ (4.6 మిలియన్ ఫాలోవర్స్), ప్రభాస్ (4 మిలియన్ ఫాలోవర్స్), మహేష్ (3.8 మిలియన్ ఫాలోవర్స్) ఉన్నారు. మున్ముందు…. ఈ రౌడీ హీరో `ఇన్ స్టా గ్రామ్` క్రేజ్ ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి మరి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: