ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు ఒక్క ఇస్మార్ట్ శంకర్ తో అటు హీరో రామ్ కి, నిర్మాతలు పూరి, ఛార్మి కి, నిధి అగర్వాల్ కి పెద్ద సక్సెసే దక్కింది. ఎప్పటినుండో రామ్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు.. ఇక నిధి కూడా వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఫస్ట్ హిట్ కోసం ఎదురుస్తుంది.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా హిట్ ఇచ్చి చాలా అయింది. అలా ఒకేసారి వీరందరికీ మంచి హిట్ ఇచ్చి కష్టకాలం నుండి బయటపడేసింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో పూరీ-రామ్ కాంబినేషన్ లో ఈ సినిమా సీక్వెల్ కూడా తీయనున్నట్టు తెలిపారు. ఇక దీనిపై కాస్త డౌట్లు వున్నాఇప్పుడు దానిపై కూడా రామ్ క్లారిటీ ఇచ్చేసాడు. రీసెంట్ గా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో…. ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి, మీ సమాధానం ఏమిటి అని అడగ్గా..ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కావచ్చు, లేదా ప్రీక్వెల్ కావచ్చు, త్వరలోనే మేము మళ్ళీ సినిమా చేయడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం చర్చల దశలో ఉంది, ఇంకా ఏమి ఫైనల్ కాలేదు. ఇప్పుడే చెప్పలేను.. కానీ ఖచ్చితంగా కొద్దిరోజులలో సినిమా చేస్తున్నాం అని క్లారిటీ ఇచ్చాడు.
కాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ ప్రధాన పాత్రలో ‘రెడ్’ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను మొన్న రిలీజ్ చేయగా…నవంబర్ 16వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది 2020 ఏప్రిల్ 9 వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ ద్వారా అధికారికంగా తెలిపారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: