‘బొమ్మరిల్లు’ భామ‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

Bumper Offer For Actress Genelia,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Genelia New Movie in Tollywood,Genelia Next Movie with Megastar,Genelia Latest News 2019,Genelia Upcoming Projects

‘సత్యం’, ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’, ‘శశిరేఖా పరిణయం’… ఇలా ప‌లు తెలుగు చిత్రాల్లో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించి న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది జెనీలియా. పెళ్ళ‌య్యాక మ‌ళ్ళీ తెలుగు సినిమాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌ని ఈ టాలెంటెడ్ బ్యూటీ… తాజాగా ఓ మెగా ఆఫర్‌ను దక్కించుకున్నట్టు టాలీవుడ్ టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ మెసేజ్ ఓరియెంటెడ్‌ మూవీ తెరకెక్క‌నున్న విషయం తెలిసిందే. ఇద్దరు నాయిక‌లకు స్థాన‌మున్న ఈ చిత్రంలో… ఇప్పటికే చెన్నై బ్యూటీ త్రిషను ఓ హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు వార్తలు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా, మరో హీరోయిన్ గా జెనీలియా పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. కొంత చిలిపిదనం, మరికొంత కొంటెతనం కలసి ఉన్న ఆ పాత్రలో జెన్నీ అయితేనే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నార‌ట‌. త్వరలోనే జెన్నీ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో `హ్యాపీ`లోనూ, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కి జంట‌గా `ఆరెంజ్‌`లోనూ జెనీలియా నాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రి… చాన్నాళ్ళ త‌రువాత మెగా కాంపౌండ్ లో సినిమా చేయ‌బోతున్న జెన్నీ… రీ-ఎంట్రీ మూవీతో ఏ స్థాయిలో రంజింప‌జేస్తుందో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − four =