“విజయ్ సేతుపతి ” మూవీ టీజర్ రిలీజ్

Vijay Sethupathi Movie Teaser Is Out,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Telugu Movie Trailers 2019,Vijay Sethupathi Movie Teaser,Vijay Sethupathi Teaser,Vijay Sethupathi Telugu Movie Teaser,Vijay Sethupathi Movie Updates

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన సంగ తమిళ మూవీ, తమిళ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి మూవీ రెండు భాషలలోనూ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మూవీలో రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ కథానాయికలు. నాజర్, అశుతోష్ రానా, రవి కిషన్ శుక్లా, తులసి ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ – మెర్విన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో విజయ్ సేతుపతి సైరా నరసింహా రెడ్డి మూవీ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ పరిచయ చిత్రం ఉప్పెన లో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ మూవీ అతని పేరే టైటిల్ గా రిలీజ్ కావడం విశేషం. విజయ్ సేతుపతి మూవీ నిహర్షిత మూవీస్ బ్యానర్ పై రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్ టీజర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకొంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =