అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక గతకొద్దికాలంగా కేరళ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ అంతా గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో మహేష్ బాబు, రష్మిక, ప్రకాశ్ రాజ్, అనీల్ రావిపూడి, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, సంగీత తదితరులు ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 14 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత `సరిలేరు నీకెవ్వరు`తో రీ-ఎంట్రీ ఇస్తుంది. కథనాల ప్రకారం… కాలేజ్ ప్రొఫెసర్‌గా ఆమె కనిపిస్తుందని తెలుస్తుంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలచేయనున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా తాకుతుందో..?లేదో..? చూద్దాం..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: