ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 40

RGV డబల్ ధమాకా

టెర్రరిస్ట్ గా సమంత..!
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?

'ఫ్రోజెన్ 2' - సితార కు లక్కీ ఛాన్స్
నవంబర్ 18 వ తేదీ ఉపేంద్ర "కబ్జ"మూవీ ప్రారంభం
అల్లు అర్జున్ కు బాస్ గా పూజ హెగ్డే
షూటింగ్ ప్రారంభమైన జయలలిత బయోపిక్ మూవీ

యూనిక్ పెయిర్ వరుణ్ తేజ్ సినిమా కోసం
రవితేజ సినిమాలో స్టార్ డాటర్స్
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తికేయ ‘90 ML’
బాలకృష్ణ చిత్రానికి అనిరుధ్ బాణీలు?
మహేష్, రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..?

#IFFI 50 ట్రెండ్ సెట్టర్స్ గా మన నటీనటులు..
విక్రమ్ ను అలా ఎందుకు అంటారో అర్థమైంది
క్రికెట్ తో పాటు పలువురు క్రికెటర్లు అప్పుడప్పుడు వెండి తెరపై కూడా సందడి చేశారు. ఇప్పటికే శ్రీశాంత్, అజయ్ జడేజా వెండి తెరపై మెరవగా.. ఇప్పుడు వారి జాబితాలో ఇర్ఫాన్ పఠాన్ కూడా చేరిపోయాడు. డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో స్టార్ హీరో చియాన్ విక్రమ్ 58వ చిత్రం రూపొందుతుంది. ఈ సినిమాలో పఠాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పఠాన్ తన షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రంలో టర్కీ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది.
'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తమిళ్ రీమేక్ లో కమెడియన్..!
అదృష్టం ఉండాలే కానీ చిన్న సినిమాలు కూడా పెద్ద హిట్లు కొడతాయి. ఇప్పటికే ఇది పలు సినిమాల్లో రుజువైంది కూడా. అలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ అయింది ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. ఈ సినిమాతో క్యారెక్టర్ నటుడు నవీన్ పొలిశెట్టి హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తె స్వప్న నిర్మించనున్న సినిమాలో నవీన్ నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నిర్మాతలు కూడా నవీన్ హీరోగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నట్టుగా…

RGV డబల్ ధమాకా
సంచలనాలకు మారుపేరైన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు మరో సంచలానికి తెర తీశారు. వారం రోజుల గ్యాప్ లో రెండు సినిమాలకు రిలీజ్ డేట్స్ ప్రకటించారు. టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందిన కమ్మరాజ్యం లో కడప రెడ్లు, బ్యూటిఫుల్ మూవీస్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు మూవీస్ కు రవిశంకర్ సంగీతం అందించారు.

టెర్రరిస్ట్ గా సమంత..!
మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి మరియు సందీప్ కిషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఫ్యామిలీ మ్యాన్'. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ విశేష ప్రజాదరణ పొందింది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.
విక్రమ్ K కుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న RRR మూవీ షూటింగ్ తో, నిర్మాతగా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. RRR మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన తరువాత తాను నటించే మూవీ కై రామ్ చరణ్ స్క్రిప్ట్స్ వింటున్నారు. రామ్ చరణ్ RRR మూవీ తరువాత నటించే మూవీ ని ఓకే చేసినట్టు సమాచారం.

'ఫ్రోజెన్ 2' - సితార కు లక్కీ ఛాన్స్
డిస్ని రూపొందించిన యానిమేషన్ మూవీ 'ఫ్రోజెన్' 2013లో విడుదలైన ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటేడ్ చిత్రంగా రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ సంవత్సరం ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ యానిమేటెడ్ చిత్రం అవార్డును గెలుచుకొన్నది.ఇక దీనిలో భాగంగానే ఫ్రొజెన్ 2 ను తీసుకురానున్నారు. ఈ చిత్రం నవంబర్ 22 తేదీన ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ అవుతున్నది.
నవంబర్ 18 వ తేదీ ఉపేంద్ర "కబ్జ"మూవీ ప్రారంభం
దేశ వ్యాప్తంగా అభిమానులున్న నటుడు, నిర్మాత, దర్శకుడు ఉపేంద్ర ఒక కొత్త మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్. చంద్రు దర్శకత్వంలో శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా అండర్ వరల్డ్ నేపథ్యం లో రూపొందనున్న మాస్ ఎంటర్ టైనర్ కబ్జ మూవీ షూటింగ్ నవంబర్ 18 వ తేదీ ప్రారంభం కానుంది. బెంగుళూరు, ముంబై, మధురై , మంగుళూరు లలో ఈ మూవీ చిత్రీకరణ జరుపుకోనుంది.
అల్లు అర్జున్ కు బాస్ గా పూజ హెగ్డే
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న అల ... వైకుంఠపురములో మూవీ సాంగ్ సామజవరగమన ప్యారిస్ లోని సుందర లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సీనియర్ హీరోయిన్ టబు, యంగ్ హీరో సుశాంత్, నివేత పేతురాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. థమన్ S సంగీతం అందించారు. ఈ మూవీ లోని రెండు సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
'పొన్నియన్ సెల్వన్' ప్రారంభానికి ముహూర్తం ఖరారు
ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమా తీస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వచ్చాయి కానీ ఇంత వరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసాడు. యువ స్టార్స్ నుంచి సూపర్‌స్టార్స్ వరకు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భాగం కాబోతున్నారు.

అల్లు అరవింద్ చేతిలో సూర్య-జ్యోతిక సినిమా హక్కులు
టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మధ్య పలు రీమేక్ సినిమాల హక్కులను సొంతం చేసుకుంటున్నాడు. తెలుగులో నాని హీరోగా వచ్చి భారీ సక్సెస్ సాధించిన జెర్సీ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. దీనితో పాటు తాజాగా మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పీరియడ్ డ్రామా మమాంగం సినిమా తెలుగు రైట్స్ కూడా సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ ను గత వరం రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్…
షూటింగ్ ప్రారంభమైన జయలలిత బయోపిక్ మూవీ
తమిళ నాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ మూవీ "తలైవి " షూటింగ్ చెన్నై లో 10వ తేదీ ప్రారంభమయింది. AL విజయ్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత పాత్ర లో నటిస్తుండగా, MGR పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు . పలువురు ప్రముఖ నటీనటులు తలైవి మూవీ లో ముఖ్య పాత్రలలో నటించనున్నారు. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

యూనిక్ పెయిర్ వరుణ్ తేజ్ సినిమా కోసం
వెండి తెరపై హీరో హీరోయిన్లకు ఫాదర్ క్యారెక్టర్ లో చేయాలంటే మనకు వెంటనే కొన్ని పేర్లు కళ్ళముందుకు వచ్చేస్తాయి. అందులో మొదట గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్, ఆ తర్వాత రావు రమేష్, మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, నాజర్, జగపతిబాబు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తాయి. అయితే ఇప్పుడు వరుణ్ సినిమా కోసం ఓ యూనిక్ పెయిర్ జంటగా నటించడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది.
ర్యాప్ సాంగ్ సింగర్ రానా దగ్గుబాటి
నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి ఇప్పుడు గాయకుడుగా మారారు. యాక్షన్ హీరో విశాల్, తమన్నా జంటగా సి. సుందర్ దర్శకత్వంలో రూపొందిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ "యాక్షన్ "తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ "యాక్షన్ "మూవీ నవంబర్ 15వ తేదీ రిలీజ్ కానున్నాయి. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను శ్రీనివాస్ ఆడెపు సమర్పిస్తున్నారు.
కథానాయకుడిగా అఖిల్ నటనాప్రస్థానానికి నాలుగేళ్ళు
బుడిబుడి అడుగుల ప్రాయంలోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న వైనం అఖిల్ అక్కినేని సొంతం. `సిసింద్రీ`(1995)గా మెస్మరైజ్ చేసిన ఈ స్టార్ కిడ్... సరిగ్గా 20 ఏళ్ళ తరువాత కథానాయకుడిగా తొలి అడుగులు వేశాడు. తన పేరుతోనే రూపొందిన `అఖిల్`(2015) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ అక్కినేని వారి మూడో తరం కథానాయకుడు... మొదటి ప్రయత్నంలోనే నటుడిగా అలరించాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటనాప్రస్థానానికి 17 ఏళ్ళు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న ఈ తరం అగ్ర కథానాయకుడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నటవారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినా... అనతికాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నాడీ హ్యాండ్సమ్ హీరో. చిత్రచిత్రప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చిన ప్రభాస్... ‘బాహుబలి’ సిరీస్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. అలాగే... అనితరసాధ్యమైన ట్రాక్ రికార్డుతో ముందుకు సాగుతున్నాడు. అలాంటి ప్రభాస్ నటనాప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘ఈశ్వర్’.
రవితేజ సినిమాలో స్టార్ డాటర్స్
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కమల్ హాసన్ తనయ శ్రుతి హాసన్ కథానాయికగా నటించనుండగా... మరో స్టార్ డాటర్ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. ఆమె మరెవరో కాదు... సీనియర్ యాక్టర్ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కార్తికేయ ‘90 ML’
‘ఆర్ ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ’90 ML’. చదువులో బంగారు పతకాలు సాధించిన ఓ యువకుడు... దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. నేహా సోలంకి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని డెబ్యూ డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఎర్ర తెరకెక్కించాడు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించగా... అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.
బాలకృష్ణ చిత్రానికి అనిరుధ్ బాణీలు?
నటసింహా నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. వీరి కలయికలో తెరకెక్కిన ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అటువంటి విజయవంతమైన జోడీ నుంచి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా రాబోతోంది. ఇందులో బాలయ్య రెండు షేడ్స్ ఉన్న పాత్రలో దర్శనమివ్వబోతున్నాడని సమాచారం. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... డిసెంబర్ 20న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, 2020 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని టాక్.
మహేష్, రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..?
ఒకప్పుడు హీరోలుసంగతేమో కానీ ఇప్పుడు హీరోలు మాత్రం కాస్త ముందు చూపుతోనే వున్నారనిపిస్తుంది. ఎందుకంటే హీరో లంటే కేవలం సినిమాలు మాత్రమే చేయాలన్న రూల్ ను బ్రేక్ చేస్తున్నారు. అందుకే ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వ్యాపార రంగాల్లోకి కూడా అడుగుపెడుతున్నారు. అందులో ముందు చెప్పుకోవాల్సింది మహేష్ బాబు గురించి. బిజినెస్ మ్యాన్ అనే టైటిల్ ఈ హీరో కి సరిగ్గా సరిపోతుంది. ఒక్క సినిమాలు మరో పక్క పలు ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్, మల్టీప్లెక్స్ బిజినెస్, ప్రొడక్షన్ హౌస్, ఈ మధ్యనే తన లేబుల్ తోనే బట్టల వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. ఇలా పలు రంగాల్లో తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఇక మిగిలిన హీరోలు కూడా తమకంటూ…

#IFFI 50 ట్రెండ్ సెట్టర్స్ గా మన నటీనటులు..
'పెళ్లి చూపులు' అనే సినిమాలో డీసెంట్‌గా కనిపించి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తెలుగు ఇండస్ట్రీని షాక్ షేక్ చేసిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఇక ఆ తర్వాత 'గీత గోవిందం', 'టాక్సీవాలా' సినిమాతో వెంటవెంటనే హిట్ లు కొట్టి టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. అంతేకాదు యూత్ లో విజయ్ దేవరకొండ భారీ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ నిర్మాత కూడా మారి సినిమాలు చేస్తున్నాడు.