కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 37

సినిమా వార్తలు

`ప్ర‌భాస్ 20` కోసం రికార్డు స్థాయిలో రెట్రో సెట్స్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చాన్నాళ్ళ త‌రువాత ఓ ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 1970ల కాలం నాటి వాతావ‌ర‌ణంతో తెర‌కెక్కుతున్న ఈ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ... ఇట‌లీ నేప‌థ్యంలో రూపొందుతోంది. పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి `జిల్‌` రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇ

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కాలాన్ని వెన‌క్కి తీసుకువెళ్ళిన `వెంకీమామ‌`

క‌థానాయ‌కుడిగా త‌న ప్ర‌యాణాన్ని ఎప్పుడైతే మొద‌లుపెట్టారో... అటుఇటుగా అదే స‌మ‌యానికి ప్రేక్ష‌కుల‌ను కూడా తీసుకెళ్ళ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్. స‌రిగ్గా చెప్పాలంటే... కాలాన్ని వెన‌క్కి తీసుకెళ్ళి మ‌రీ వినోదాలు పంచ‌నున్నారు. అయితే, ఇదంతా `వెంకీమామ‌` చిత్రంలోని పాట‌ కోస‌మే సుమా. `వింటేజ్ వెంకీ`ని గుర్తుచేసేలా డిజైన్ చేసిన ఈ రెట్రో నంబ‌ర్‌... వెంకీ ఫ్యాన్స్‌నే కాదు కామ‌న్ ఆడియ‌న్స్‌ని కూడా మెస్మ‌రైజ్ చేసేలా ఉంటుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Marks Zero Releases For These Heroes,Latest Telugu Movies News,Telugu Film News 2019,Telugu Filmnagar,Tollywood Cinema Updates,2019 Tollywood Zero Heroes,2019 Marks Zero Telugu Heroes,Telugu Actors 2019 Marks Zero
సినిమా వార్తలు

2019 లో 'జీరో రిలీజ్' హీరోలు

ఏ క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లోనైనా స‌రే... క‌థానాయ‌కులంద‌రూ వెండితెర‌పై హాజ‌రు ప‌లికితేనే క‌నువిందుగా ఉంటుంది. అయితే, ఇది అరుదుగా చోటుచేసుకుంటూ ఉంటుంది. భారీ బ‌డ్జెట్ చిత్రాల కోసం కాల్షీట్స్ కేటాయించ‌డం... లేదంటే అనుకున్న స‌మ‌యానికి సినిమాలు విడుద‌ల కాక‌పోవ‌డం... అదీ కాదంటే ప‌రాజ‌యాలతో పున‌రాలోచ‌న‌లో ప‌డి సెలెక్టివ్ గా స్క్రిప్ట్స్ ఎంచుకోవ‌డం... ఇలాంటి కార‌ణాల‌తో ప్ర‌తీ ఏడాదిలోనూ కొంద‌రు `మిస్సింగ్ స్టార్స్‌` ఉంటారు. అలా... 2019లోనూ మిస్సింగ్ స్టార్స్ ఉన్నారు. ఆ తార‌ల గురించి క్లుప్తంగా...

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ లైన‌ప్ సెట్ చేసుకున్న సూర్య‌

పేరుకి త‌మిళ క‌థానాయ‌కుడైనా తెలుగులోనూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌ మార్కెట్‌ని సంపాదించుకున్నాడు సూర్య‌. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. ఈ ఏడాది `ఎన్జీకే`, `బందోబ‌స్త్‌` చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన ఈ టాలెంటెడ్ స్టార్... ప్ర‌స్తుతం `గురు` ఫేమ్ సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో `సూర‌రై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హ‌ద్దురా`)లో న‌టిస్తున్నాడు. ఎయిర్ డెక్క‌న్ ఫౌండ‌ర్ కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 వేస‌విలో తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
సాంగ్

`ఆర్ ఆర్ ఆర్‌` కోసం య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సాంగ్‌?

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌... ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడా నృత్యాల‌కు పెట్టింది పేరు. అలాంటి ఈ డాన్సింగ్ స్టార్స్ క‌ల‌సి ఓ సినిమాలో న‌టిస్తున్నారంటే... ఎవ‌రైనా స‌రే కాంబినేష‌న్ డాన్స్ నంబ‌ర్‌ని ఎక్స్ పెక్ట్ చేయ‌డం స‌హ‌జం. ఈ సంగ‌తి.. చిత్ర రూప‌క‌ర్త, ద‌ర్శ‌క‌ధీరుడు య‌స్.య‌స్. రాజ‌మౌళికి కూడా తెలియంది కాదు. అందుకే... తార‌క్, చర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` కోసం ఓ అదిరిపోయే డాన్స్ నంబ‌ర్‌ని ప్లాన్ చేశాడ‌ట జ‌క్క‌న్న‌.

Team TFNవాట్సాప్
Megastar Chiranjeevi Graces at ANR National Awards Ceremony,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,ANR National Awards Ceremony Chief Guest,ANR National Award announced to Sridevi and Rekha,ANR Na
సినిమా వార్తలు

ANR నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ కు చీఫ్ గెస్ట్

సినీరంగానికి సేవలందించిన సినీ ప్రముఖులలో ఒకరికి అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతీ సంవత్సరం అక్కినేని అవార్డ్ అందజేస్తున్నారు. 2016 సంవత్సరంలో నటుడు, నిర్మాత , దర్శకుడు దేవానంద్, 2017 సంవత్సరంలో దర్శకధీర రాజమౌళి ఈ అవార్డ్స్ అందుకున్నారు. 2018నసంవత్సరానికి శ్రీదేవి, 2019 సంవత్సరానికి రేఖ ఎంపికయ్యారని కింగ్ నాగార్జున మీడియా సమావేశంలో వెల్లడించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త దర్శకుడితో హీరో నాని మూవీ ?

డిఫరెంట్ పాత్రలు, విభిన్న కథల చిత్రాలలో నటించే హీరో నాని కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో రూపొందుతున్న" V"మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

జయలలిత బయోపిక్ మూవీలో MGR లుక్

లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. విష్ణు ఇందూరి , శైలేష్ R సింగ్ నిర్మాణసారథ్యం లో AL విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ జయలలిత పాత్ర లో నటిస్తున్న తలైవి మూవీ 10 వ తేదీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తలైవి మూవీ లో అరవింద్ స్వామి MGR పాత్రలో నటిస్తున్నారు. పలువురు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ముఖ్య పాత్రలలో నటిస్తారని సమాచారం. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack Movie Begins Its Shooting Schedule,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ravi Teja Krack Movie Shooting Updates,Krack Telugu Movie Updates,Krack Movie Latest News
షూటింగ్ అప్‌డేట్

"క్రాక్" మూవీ షూటింగ్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ "క్రాక్ "షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. నటుడు, దర్శకుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`ప్ర‌తి రోజూ పండ‌గే`లో రాశీ ఖ‌న్నా పాత్ర అదేనా?

ద‌ర్శ‌కుడు మారుతి సినిమాల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. అదేమిటంటే... క‌థాంశం ఏదైనా, ఆయా చిత్రాల్లో క‌థానాయ‌కుల‌కు ఏదో ఒక బ‌ల‌హీన‌త (లేదా లోపం) క‌నిపిస్తుంటుంది. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` నుంచి `మ‌హానుభావుడు` వ‌ర‌కు ఈ ఫార్ములాని భ‌లేగా అప్ల‌య్ చేశాడు మారుతి. క‌ట్ చేస్తే... త‌న నెక్ట్స్ వెంచ‌ర్ `ప్ర‌తి రోజూ పండ‌గే`లోనూ దీన్ని కొన‌సాగించే ప‌నిలో ఉన్నాడ‌ట మారుతి. అయితే... ఈ సారి హీరో పాత్ర‌కి కాకుండా హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం ఈ బ‌ల‌హీన‌త‌ని డిజైన్ చేశాడ‌ట‌.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

అల .. వైకుంఠపురములో .. థర్డ్ సింగిల్ టీజర్ రిలీజ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ అల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు, సత్యరాజ్ , సుశాంత్, రాజేంద్ర ప్రసాద్ , రావు రమేష్, మురళీశర్మ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`మర్జావాన్‌`కి రకుల్ ప్రీత్ సెంటిమెంట్‌

చిత్రసీమలో ఒక్కొక్కరికి ఒక్కో అదృష్ట‌మాసం ఉంటుంది. అలా... స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్‌కి కూడా ఓ ల‌క్కీ మంత్ ఉంది. ఆ నెలే... నవంబర్. రకుల్ కెరీర్‌లో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన తెలుగు సినిమా ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’(2013 న‌వంబ‌ర్ 29)... ఆరేళ్ళ క్రితం ఇదే నవంబర్‌లో విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. అలాగే త‌మిళనాట ర‌కుల్‌కి మెమొరబుల్ ఫిల్మ్ గా నిల‌చిన‌ ‘థీరన్ అధిగారం ఒండ్రు’ (తెలుగులో ‘ఖాకి’) (2017 నవంబ‌ర్ 17) కూడా రెండేళ్ళ క్రితం ఇదే నవంబర్‌లో రిలీజై మంచి విజయాన్ని అందుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘డిస్కోరాజా’... మాస్ మహారాజా బర్త్‌డే స్పెషల్

ఇప్పటివరకు మాస్ మహారాజా రవితేజ క‌థానాయ‌కుడిగా నటించిన ఏ సినిమా కూడా త‌న‌ బర్త్‌డే స్పెషల్ గా రిలీజ్ కాలేదు. అయితే, తొలిసారి ఆ క్రెడిట్‌తో అభిమానుల ముందుకు రానుంది ‘డిస్కోరాజా’.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

క‌ళ్యాణ్ రామ్‌తో మ‌రోసారి కె.వి.గుహ‌న్‌ ?

యువ కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్, టాలెంటెడ్ డైరెక్టర్ కె.వి.గుహన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘118’. ఈ ఏడాది మార్చిలో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్... బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా... క‌ళ్యాణ్‌, గుహ‌న్‌ క‌ల‌యిక‌లో మరో సినిమా రాబోతున్న‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మైత్రీ మూవీ మేకర్స్‌తో వెంకీ కుడుముల?

`ఛ‌లో`(2018) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశాడు వెంకీ కుడుముల‌. మొద‌టి సినిమాతోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందుకున్న ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్‌... ప్ర‌స్తుతం యువ క‌థానాయ‌కుడు నితిన్‌తో `భీష్మ‌` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి 21న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ లోపే... త‌న మూడో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించే దిశ‌గా ప్ర‌ణాళిక ర‌చిస్తున్నాడ‌ట వెంకీ.

Team TFNవాట్సాప్
RT 66 Movie Team Unveils Movie Title and First Look Poster,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,RT 66 Movie Title,Krack First Look Poster,Krack Movie First Look Poster,Ravi Teja Krack Movie
ఫస్ట్ లుక్

#RT 66 మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మాణ సారథ్యం లో మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందనున్న #RT66 మూవీ షూటింగ్ ఈ రోజు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శృతి హాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్స్ కాగా , నటుడు, దర్శకుడు సముద్ర ఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ కి థమన్ Sసంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సూపర్ గా 'యాక్షన్' ప్రీ రిలీజ్ బిజినెస్

కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియ‌ర్‌ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వుంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్‌ శంకర్‌, గద్దలకొండ గణేష్‌, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ’యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలే వున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

యంగ్ హీరో కోసం అద్దెకు భారీ స్టేడియం

డెన్నీస్ జీవన్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా 'A1 ఎక్స్ ప్రెస్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా తమిళ్ లో వచ్చిన ఓ సినిమా రీమేక్ అని తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'అల వైకుంఠపురములో' నుండి 'ఓ మై గాడ్ డాడీ'

'అల వైకుంఠపురములో' నుండి వచ్చిన 'సామజవరగమన'.. 'రాములో రాములా' పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట వచ్చిన 'సామజవరగమన' పాట సూపర్ హిట్ అయింది 100 మిలియన్ వ్యూస్ ను దాటి ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు రానన్ని వ్యూస్ తో యూ ట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్, వ్యూస్ రావడం ఇదే ప్రధమం. ఇక ఈ పాట తర్వాత వచ్చిన 'రాములో రాములా' పాట కూడా అదే రేంజ్ లో హిట్ అయింది. విడుదలైన 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ (8.3 మిలియ‌న్ వ్యూస్‌) పొందిన ద‌క్షిణాది పాట‌గా మ‌రో రికార్డుని సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
సాంగ్

ఒక్క సాంగ్ మినహా ప్రతి రోజూ పండగే షూటింగ్ పూర్తి

గీతా ఆర్ట్స్ , UV క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దాసరి దర్శకత్వం లో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ప్రతి రోజూ పండగే మూవీ డిసెంబర్ 20 వ తేదీ రిలీజ్ కానుంది. సత్యరాజ్ ఒక కీలక పాత్ర లో నటించారు. గ్రామీణ నేపథ్యం లో రూపొందుతున్న ఈ మూవీ లో అనుబంధాలకు పెద్ద పీట వేశారు. థమన్ S సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్

షేర్