`ఆర్ ఆర్ ఆర్‌` కోసం య‌న్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్ సాంగ్‌?

Jr NTR and Ram Charan Dance Together in RRR, Jr NTR and Ram Charan Special Song In RRR Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019,Telugu Filmnagar,Tollywood Cinema Updates,RRR Movie Special Song,RRR Movie Shooting Updates

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌… ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడా నృత్యాల‌కు పెట్టింది పేరు. అలాంటి ఈ డాన్సింగ్ స్టార్స్ క‌ల‌సి ఓ సినిమాలో న‌టిస్తున్నారంటే… ఎవ‌రైనా స‌రే కాంబినేష‌న్ డాన్స్ నంబ‌ర్‌ని ఎక్స్ పెక్ట్ చేయ‌డం స‌హ‌జం. ఈ సంగ‌తి.. చిత్ర రూప‌క‌ర్త, ద‌ర్శ‌క‌ధీరుడు య‌స్.య‌స్. రాజ‌మౌళికి కూడా తెలియంది కాదు. అందుకే… తార‌క్, చర‌ణ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిస్తున్న `ఆర్ ఆర్ ఆర్` కోసం ఓ అదిరిపోయే డాన్స్ నంబ‌ర్‌ని ప్లాన్ చేశాడ‌ట జ‌క్క‌న్న‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఉత్త‌రాదిలో అనుకోకుండా క‌ల‌సిన కొమ‌రం భీమ్ (తార‌క్‌), అల్లూరి సీతారామ‌రాజు (చ‌ర‌ణ్) మ‌ధ్య సంద‌ర్భానికి త‌గ్గ‌ట్టు వ‌చ్చే ఈ గీతం… ఇరువ‌ర్గాల అభిమానుల‌ను అల‌రించేలా ఉంటుంద‌ని టాక్‌. అంతేకాదు… సినిమాలో వ‌చ్చే ఏకైక కాంబినేష‌న్ సాంగ్ ఇదేనని వినికిడి. అందుకే… ఈ పాట‌ని అటు ట్యూన్ ప‌రంగా, ఇటు పిక్చ‌రైజేష‌న్ ప‌రంగా స్పెష‌ల్‌గా డిజైన్ చేస్తోంద‌ట జ‌క్క‌న్న అండ్ టీమ్‌. మ‌రి… తార‌క్, చ‌ర‌ణ్ కాంబినేష‌న్ డాన్స్ నంబ‌ర్ వెండితెర‌పై ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తుందో తెలియాలంటే… 2020 జూలై 30 వ‌ర‌కు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =