కథానాయకుడిగా తన ప్రయాణాన్ని ఎప్పుడైతే మొదలుపెట్టారో… అటుఇటుగా అదే సమయానికి ప్రేక్షకులను కూడా తీసుకెళ్ళబోతున్నారు విక్టరీ వెంకటేష్. సరిగ్గా చెప్పాలంటే… కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళి మరీ వినోదాలు పంచనున్నారు. అయితే, ఇదంతా `వెంకీమామ` చిత్రంలోని పాట కోసమే సుమా. `వింటేజ్ వెంకీ`ని గుర్తుచేసేలా డిజైన్ చేసిన ఈ రెట్రో నంబర్… వెంకీ ఫ్యాన్స్‌నే కాదు కామన్ ఆడియన్స్‌ని కూడా మెస్మరైజ్ చేసేలా ఉంటుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఓల్డ్ – ఫ్యాషన్డ్ బ్లేజర్, బెల్ బాటమ్ పాంట్స్‌లో వెంకీ తన చిందులతో కనువిందు చేయనున్నారు. `ఆర్ ఎక్స్ 100` భామ పాయల్ రాజ్ పుత్ తో వెంకీ ఆడిపాడిన `ఎన్నాళ్ళకో` పాటలో…. ఈ తరహా వాతావరణం కనిపించనుంది. థమన్ స్వరపరిచిన ఈ గీతం తాలూకు లిరికల్ వీడియోని శనివారం (నవంబర్ 16) విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన రెట్రో పోస్టర్ లోనే వింటెజ్ లుక్‌లో వెంకీ అదరగొడుతున్నారు. మరి… ఈ పాట వెండితెరపై ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదల తేదీ వరకు వేచిచూడాల్సిందే.
డి.సురేశ్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న `వెంకీమామ`కి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో వెంకీ-పాయల్ జోడీతో పాటు నాగచైతన్య, రాశీఖన్నా మరో జంటగా నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: