`ప్ర‌తి రోజూ పండ‌గే`లో రాశీ ఖ‌న్నా పాత్ర అదేనా?

Raashi Khanna Plays Unique Character In Prathi Roju Pandage,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Raashi Khanna Role in Prathi Roju Pandage,Prathi Roju Pandage Movie Updates,Raashi Khanna New Movie Updates

ద‌ర్శ‌కుడు మారుతి సినిమాల‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉంటుంది. అదేమిటంటే… క‌థాంశం ఏదైనా, ఆయా చిత్రాల్లో క‌థానాయ‌కుల‌కు ఏదో ఒక బ‌ల‌హీన‌త (లేదా లోపం) క‌నిపిస్తుంటుంది. `భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌` నుంచి `మ‌హానుభావుడు` వ‌ర‌కు ఈ ఫార్ములాని భ‌లేగా అప్ల‌య్ చేశాడు మారుతి. క‌ట్ చేస్తే… త‌న నెక్ట్స్ వెంచ‌ర్ `ప్ర‌తి రోజూ పండ‌గే`లోనూ దీన్ని కొన‌సాగించే ప‌నిలో ఉన్నాడ‌ట మారుతి. అయితే… ఈ సారి హీరో పాత్ర‌కి కాకుండా హీరోయిన్ క్యారెక్ట‌ర్ కోసం ఈ బ‌ల‌హీన‌త‌ని డిజైన్ చేశాడ‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా `టిక్‌-టాక్‌` ట్రెండ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టే…`టిక్‌-టాక్‌` వీడియోల‌తో సెల‌బ్రిటీ అయిపోవాల‌ని క‌ల‌లు క‌నే యువ‌తిగా క‌థానాయిక పాత్రని తీర్చిదిద్దాడ‌ట మారుతి. కాన్సెప్ట్ ప్ర‌కారం… సినిమా సీరియ‌స్ సాగినా…`టిక్‌-టాక్‌` క్వీన్ గా రాశీ ఖ‌న్నా చేసే సంద‌డి మాత్రం మ‌స్త్ ఎంట‌ర్‌టైన్ చేస్తుంద‌ట‌. మ‌రి… ఈ కొత్త తరహా పాత్రలో రాశి ఏ స్థాయిలో అల‌రిస్తుందో తెలియాలంటే… డిసెంబర్ 20 వరకు వేచిచూడాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =