ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 36
డబ్బింగ్ షురూ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’?
కాజల్ అగర్వాల్ శాండల్ వుడ్ ఎంట్రీ ?

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?
బన్నీ-సుకుమార్ సినిమా - రివెంజ్ ఫార్ములా..!
'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడింగ్
'అసురన్' రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాల..?

కార్తీ 'దొంగ' టీజర్ రిలీజ్
కృష్ణ ‘బుర్రిపాలెం బుల్లోడు’కు 40 ఏళ్ళు

బ్లాక్ బస్టర్ సక్సెస్ - నాలుగో వారంలోకి 'ఖైదీ'
`ప్రతి రోజూ పండగే`లో మారుతి తనయ
బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగ చైతన్య?
'ఒరేయ్ బుజ్జిగా' లో కుమారి 21 ఎఫ్ ఫేమ్
తమిళ్ చాలా కష్టంగా వుంది..!
'మిస్ మ్యాచ్' రిలీజ్ డేట్ ఫిక్స్
'పొన్నియన్ సెల్వన్' నుండి ఔట్..!
‘బాహుబలి’ రి-రిలీజ్ కానుందా?
‘బాహుబలి’... దక్షిణాది సినిమాకి కొత్త దారి చూపించిన తెలుగు చిత్రం. ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కంక్లూజన్’ పేర్లతో రెండు భాగాలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ విజువల్ వండర్... ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతేకాదు... రెండో భాగమైన ‘బాహుబలి: ది కంక్లూజన్’ అయితే... భారతీయ చిత్ర పరిశ్రమలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలచింది. అంతర్జాతీయ స్థాయిలో విజయఢంకా మోగించిన ఈ అద్భుత జానపద చిత్రరాజాన్ని... ఇప్పుడు రి-రిలీజ్ చేసే దిశగా ప్లానింగ్ జరుగుతోందని టాక్.
డబ్బింగ్ షురూ చేసిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఇందులో నాలుగు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నాడు విజయ్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకుడు. గోపీసుందర్ స్వరాలు సమకూరుస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ను... క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.
పాట చిత్రీకరణలో ‘సరిలేరు నీకెవ్వరు’
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా దర్శనమివ్వనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం కేరళ పరిసర ప్రాంతాల్లో ఓ పాటను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
కాజల్ అగర్వాల్ శాండల్ వుడ్ ఎంట్రీ ?
టాలీవుడ్, లో, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ అగర్వాల్ తన అందం, అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పుడు కాజల్ శాండల్ వుడ్ ఎంట్రీ కి రంగం సిద్ధమయ్యింది. SS ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఆర్ చంద్రు దర్శకత్వంలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర హీరోగా కన్నడ, తెలుగు, తమిళ. మలయాళ , హిందీ, మరాఠీ, బెంగాలీ భాషలలో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "కబ్జ"మూవీ ఈ రోజు ప్రారంభం కానుంది. కబ్జ మూవీ పాన్ ఇండియా ఫిల్మ్ గా రూపొందుతుంది.

దిగ్గజ దర్శకుడు బాపు చివరి చిత్రం ‘శ్రీరామరాజ్యం’కు 8 ఏళ్ళు
దిగ్గజ దర్శకుడు బాపు పేరు చెబితే చాలు... ఆయన దర్శకత్వంలో రూపొందిన పలు సీతారాముల కథలు కళ్ళ ముందు కదలాడతాయి. అలా... ఆయన తెరకెక్కించిన సీతారాముల చిత్రాలలో ఓ అపురూప దృశ్యకావ్యంగా నిలచిపోయిన సినిమా ‘శ్రీరామరాజ్యం’. అలనాటి ‘లవకుశ’ను గుర్తు చేస్తూ రూపొందించిన ఈ చలనచిత్రంలో... శ్రీరామచంద్రునిగా నందమూరి బాలకృష్ణ, సీతమ్మగా నయనతార దర్శనమిచ్చారు. ఇతర ముఖ్య పాత్రల్లో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు(వాల్మీకి), శ్రీకాంత్(లక్ష్మణుడు), సమీర్(భరతుడు), ఎ.వి.ఎస్(నారద మహర్షి), మురళీమోహన్(జనక మహారాజు), విందు ధారాసింగ్(హనుమంతుడు), కె.ఆర్.విజయ(కౌసల్యాదేవి), రోజా(భూదేవి), మాస్టర్ గౌరవ్(లవుడు), మాస్టర్ ధనుష్…

వెంకటేష్ బర్త్‌డే స్పెషల్‌గా ‘వెంకీమామ’?
డిసెంబర్ 13... విక్టరీ వెంకటేష్‌కి ఎంతో ప్రత్యేకమైన తేది. ఎందుకంటే... ఆ రోజు వెంకీ పుట్టినరోజు మాత్రమే కాదు పెళ్ళి రోజు కూడా. అలాంటి స్పెషల్ డేన ఇప్పటివరకూ వెంకీ నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. అయితే, ఆ ముచ్చటని తీర్చబోతున్నాడు `వెంకీమామ`.
బన్నీ-సుకుమార్ సినిమా - రివెంజ్ ఫార్ములా..!
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో 'అల వైకుంఠపురములో' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో... ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను.. పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’, 'రాములో రాములా' పాటలను రిలీజ్ చేశారు.
'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సీక్వెల్ 'రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్'
మరోసారి తన టైటిల్ తోనే దుమారం రేపుతూ.. రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతోనే సినిమాకు సగం క్రేజ్ తీసుకొచ్చేసాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి... డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. రీసెంట్ గా ఈ సినిమా నుండి 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి మరో షాకిచ్చాడు.
'సరిలేరు నీకెవ్వరు' టీజర్ లోడింగ్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
'అసురన్' రీమేక్ కోసం శ్రీకాంత్ అడ్డాల..?
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన 'అసురన్' మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

కార్తీ 'దొంగ' టీజర్ రిలీజ్
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుండో మంచి హిట్ కోసం ఎదురుచూసిన కార్తీ ఎదురుచూపులు ఫలితం దక్కింది. సక్సెస్ ఫుల్ గా మూడు వారలు పూర్తి చేసుకొని.. నాలుగో వారంలోకి అడుగుపెట్టింది.
కృష్ణ ‘బుర్రిపాలెం బుల్లోడు’కు 40 ఏళ్ళు
సూపర్ స్టార్ కృష్ణకి అచ్చొచ్చిన కథానాయికల్లో అతిలోక సుందరి శ్రీదేవి ఒకరు. అలాంటి ఈ ఇద్దరు జంటగా నటించిన తొలి చిత్రం ‘బుర్రిపాలెం బుల్లోడు’. బీరం మస్తాన్ రావు (దర్శకుడిగా మొదటి సినిమా) రూపొందించిన ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ, నాగభూషణం, అల్లు రామలింగయ్య, కాంతారావు, గిరిబాబు, పి.ఎల్.నారాయణ, పండరీబాయి, ఛాయాదేవి, పుష్పకుమారి, రమోల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తిరుపతి ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కె.విద్యాసాగర్ నిర్మించిన ఈ సినిమాకి సత్యానంద్ - జంధ్యాల కథను అందించారు.

బ్లాక్ బస్టర్ సక్సెస్ - నాలుగో వారంలోకి 'ఖైదీ'
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంప ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా... దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించిం తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
`ప్రతి రోజూ పండగే`లో మారుతి తనయ
`సుప్రీమ్` జోడి సాయితేజ్, రాశీఖన్నా మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం `ప్రతి రోజూ పండగే`. కుటుంబ బంధాలు, మానవ విలువల నేపథ్యంలో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో సత్యరాజ్, రావురమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నాగ చైతన్య?
ప్రస్తుతం తెలుగునాట అగ్ర కథానాయకుల నుంచి యువ కథానాయకుల వరకు అందరూ పరభాషా చిత్రాల రీమేక్‌ల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ వరుసలోనే యువ సామ్రాట్ నాగ చైతన్య కూడా తాజాగా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.

విశాల్ మరో యాక్షన్ సినిమా - ఫస్ట్ లుక్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్ లతోనే భారీ అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి టాక్ నే…
'ఒరేయ్ బుజ్జిగా' లో కుమారి 21 ఎఫ్ ఫేమ్
విజయ్‌కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా 'ఒరేయ్.. బుజ్జిగా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.
తమిళ్ చాలా కష్టంగా వుంది..!
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాను ప్రారంభించారు చిత్రయూనిట్.
'మిస్ మ్యాచ్' రిలీజ్ డేట్ ఫిక్స్
'అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి' సంస్థలో తొలి చిత్రం గా 'మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం.
'పొన్నియన్ సెల్వన్' నుండి ఔట్..!
ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమా తీస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వార్తలైతే వచ్చాయి కానీ ఇంత వరకూ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. తమిళ్ లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ఇదే కావడంతో మణిరత్నం కూడా ఈ సినిమాలో నటించే నటీమణులను కూడా అంతే ప్రముఖులను సెలెక్ట్ చేసాడు. యువ స్టార్స్ నుంచి సూపర్‌స్టార్స్ వరకు పొన్నియన్ సెల్వన్ చిత్రంలో భాగం కాబోతున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ చిత్రం డిసెంబర్ 12వ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి కూడా విదితమే.