అనుష్క కి జ‌న‌వ‌రి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?

Anushka Shetty Banks On Her Lucky Month Sentiment For Her Movie Success

`అరుంధ‌తి`తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి శ్రీ‌కారం చుట్టింది అనుష్క‌. మొద‌టి ప్ర‌య‌త్నంలోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది కూడా. ఆపై`పంచాక్ష‌రి, వ‌ర్ణ‌, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో, భాగ‌మ‌తి` వంటి నాయికా ప్రాధాన్య చిత్రాల‌తో ప‌ల‌క‌రించిన స్వీటీకి… వీటిలో `భాగ‌మ‌తి` మిన‌హా మ‌రే సినిమా విజ‌యాన్ని ఇవ్వ‌లేక‌పోయింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… `అరుంధ‌తి`, `భాగ‌మ‌తి`… ఈ రెండు చిత్రాలు కూడా వేర్వేరు సంవ‌త్స‌రాల్లో జ‌న‌వ‌రి నెల‌లోనే రిలీజ‌య్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క‌ట్ చేస్తే… ఇప్పుడ‌దే నెల‌లో మ‌రో ఉమ‌న్ సెంట్రిక్ ఫిల్మ్ తో సంద‌డి చేయ‌నుంది స్వీటీ. ఆ చిత్రమే `నిశ్శ‌బ్దం`. 2020 జ‌న‌వ‌రి 31న ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. మ‌రి… ల‌క్కీ మంత్ లో వ‌స్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ… ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీతోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.