ఆ రీమేక్ ని వ‌దిలేసిన వెంకీ?

Venkatesh Gives Up Asuran Movie

విక్ట‌రీ వెంక‌టేష్ తాజా చిత్రం `వెంకీమామ‌`… త‌న బ‌ర్త్ డే స్పెష‌ల్ గా డిసెంబ‌ర్ 13న విడుద‌ల కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌రువాత త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ `అసుర‌న్` రీమేక్ లో న‌టించ‌బోతున్నారు ఈ సీనియ‌ర్ హీరో. ఇందులో రెండు ఛాయ‌లున్న పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు వెంకీ. శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ట్ చేయ‌బోతున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్… జ‌న‌వ‌రిలో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. ఆ త‌రువాత యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ కాంబోలో హార్స్ రేస్ క్ల‌బ్ నేప‌థ్యంలో వెంకీ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తార‌ని టాక్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ మ‌ధ్య‌లో హిందీ సూప‌ర్ హిట్ `దే దే ప్యార్ దే` రీమేక్ కూడా వెంకీ చేస్తార‌ని కొంత‌కాలం క్రితం వార్త‌లు వ‌చ్చాయి. వెంకీ సోద‌రుడు, ప్ర‌ముఖ నిర్మాత డి.సురేష్ బాబు ఈ రీమేక్ రైట్స్ పొందారు కూడా. అయితే, కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ రీమేక్ ని వెంకీ వ‌ద్ద‌నుకుంటున్నార‌ని వినికిడి. మ‌రి… వెంకీ వ‌ద్ద‌నుకున్న ఈ రీమేక్ ని మ‌రే సీనియ‌ర్ హీరో చేస్తారో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.