మోస్ట్ స్టైలిష్ హీరో విజయ్ దేవరకొండ.. !

Alia Bhatt About Vijay Deverakonda

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో అటు తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ లోనూ.. నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ. ఈ ఒక్క సినిమా విజయ్ సినీ కెరీర్ నే మార్చేసింది. ఇక మన యంగ్ హీరోకు అభిమానులు కూడా అదే రేంజ్ లో పెరిగారు. కేవలం సామాన్యులే కాదు టాప్ హీరోయిన్ లు కూడా విజయ్ స్టైల్ కు ఫిదా అయిపోతున్నారు. రోజు రోజుకి విజయ్ కు ఫిదా అయిపోతున్న సెలబ్రిటీస్ కౌంట్ పెరిగిపోతోందే తప్పా… తగ్గడంలేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాహ్నవి సైతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయాలనివుంది అని చెప్పగా.. అర్జున్ రెడ్డి రీమేక్ చేసి కబీర్ సింగ్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కియారా అద్వాని గతంలో తనకు విజయ్ తో చేయాలని చెప్పడం… తర్వాత ప్రియా ప్రకాష్ వారియర్ విజయ్‌ దేవరకొండతో దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘నువ్వంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం.. రకుల్ కూడా విజయ్ దేవరకొండ అంటే క్రష్ అని చెప్పడం ఇవన్నీ విజయ్ క్రేజ్ కు ఉదాహరణ అని చెప్పొచ్చు. ఇప్పుడు మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్. అలియా భట్ సైతం విజయ్ తన ఫేవరెట్ అంటోంది. ఫిల్మ్ ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ వేడుకలో మీకు ఈ యేడాదిలో బాగా నచ్చిన మోస్ట్ గ్లామరస్ స్టార్స్ ఎవరని అడగ్గా దానికి సమాధానం చెబుతూ తనకిష్టమైన గ్లామర్ నటి అనుష్క శర్మ అని నటుడు విజయ్ దేవరకొండ అంది. మొత్తానికి మనోడి స్టైల్ కి అక్కడ వాళ్ళు కూడా ఫిదా అవ్వడం గ్రేటే కదా..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 10 =