మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈ సినిమాలో సాయి తేజ్ హీరో సరసన రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తుంది. సత్యరాజ్ మరో కీలక పాత్రలో నటిస్తుండగా… రావు రమేష్, మురళీశర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్యశ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈసినిమాకు.. ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నాడు. జయకుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: