ఒక్కరోజు మాత్రమే ఆలస్యం – కిక్ లో తేడా లేదు

Kartikeya About 90ML Movie Delay,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,90ML Movie Updates,90ML Telugu Movie Latest News,90ML Movie Release Date,90ML Telugu Movie Release Date,90ML Movie Release Date Postponed,90ML Telugu Movie Delay

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా ’90ML’. ఈ సినిమా రిలీజ్ ఒక రోజుకు వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి వుంది. నిన్న సెన్సార్ క్లియరెన్స్ చేయకపోవడంతో వాయిదా పడింది. ఈ రోజు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో శుక్రవారానికి మార్చారు.ఇక ఈ విషయాన్ని కార్తికేయ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే విడుదలైన పాటలకి, టీజర్,ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగులు, ఫైట్స్ ట్రైలర్ లో కనిపించడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.

యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తికేయ సరసన నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తుండగా… రవి కిషన్, రావు రమేష్, అలీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమాకు కూడా ‘ఆర్ ఎక్స్100’ సినిమాను నిర్మించిన అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

MBA గోల్డ్ మెడలిస్ట్ సాధించిన ఓ యువకుడు… దేవదాస్‌గా ఎందుకు మారాడు? అనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందింది. మరి ‘ఆర్ ఎక్స్ 100’ తరువాత ఆ రేంజ్ హిట్ కార్తికేయకు దక్కలేదు. మరి ఈ సినిమాతో అయినా మరి భారీ హిట్ కార్తికేయ ఖాతాలో పడుతుందో?లేదో? చూద్దాం..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − eleven =