రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ‘వెంకీమామ’ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు తేదీ సహా వెన్యూ ఫిక్సయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ వేదికగా డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోలు.. పోస్టర్లు సినిమాపై హైప్ పెంచగా.. ఇప్పుడు తాజాగా మరో మాస్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘కోకా కోలా పెప్సీ’ అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. వెంకీ-పాయల్ జోడీ.. చైతన్య- రాశీ ఖన్నా జోడీలు కలిసి సందడి చేస్తున్న ఈ పాట ఆకట్టుకుంటుంది.
కాగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. మరి చూద్దాం మామా అల్లుళ్లు తెరపై ఎలాంటి సందడి చేయబోతున్నారో..
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: