బాలీవుడ్ లో రీమేక్ కు బెల్లంకొండ సినిమా..!

Bellamkonda Sreenivas Movie To Be Remade in Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Bellamkonda Sreenivas Latest News,Bellamkonda Sreenivas New Movie Updates,Bellamkonda Sreenivas Upcoming Fillm News,Bellamkonda Sreenivas Next Project Details,Bellamkonda Sreenivas Latest Movie Details

ఈ రోజుల్లో సినిమాకు భాషా హద్దులు చెరిగిపోయానని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైన సినిమా రిలీజ్ అయి హిట్ అయితే చాలు వెంటనే రైట్స్ కొనేస్తున్నారు.. వేరే భాషలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి ని ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి షాహిద్ కపూర్ హిట్ కొట్టి మళ్ళీ రీమేక్ నే నమ్ముకున్నాడు. ఈసారి ‘జెర్సీ’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక షారుఖ్ కూడా రీమేక్ నే నమ్ముకున్నాడు. వీరితో పాటు పలువురు హీరోలు రీమేక్ లనే నమ్ముకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ వాళ్ళ కన్ను మరో సౌత్ సూపర్ హిట్ చిత్రంపై పడింది. తమిళంలో ఘనవిజయం సాధించిన రాక్షసన్ చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు టాక్. తెలుగు రీమేక్ లో బెల్లకొండ శ్రీనివాస్ నటించగా ఇక్కడ కూడా మంచి విజయమే సాధించింది. అంతేకాదు వరుస ప్లాప్స్ తర్వాత ఈ సినిమాతోనే కాస్త హిట్ కొట్టాడు సాయి శ్రీనివాస్. ఇక ఈ సినిమాను కూడా బాలీవుడ్ లో రీమేక్ చేయాలని చూస్తున్నారు. క్రేజీ నటుడు ఆయుష్మాన్ ఖురానా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయుష్మాన్ దృష్టి ప్రస్తుతం రాక్షసన్ రీమేక్ పై పడ్డట్లు తెలుస్తోంది. మొదటినుండి వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ.. వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు ఆయుష్మాన్. ఇక ఈ సినిమాను కూడా రీమేక్ చేస్తే ఖచ్చితంగా హిట్ కొడతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఇవి వార్తలేనా..? ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 20 =