‘తలైవి’ లో శోభన్ బాబు పాత్రలో..?

ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ ‘తలైవి’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాలో ఎం.జి.రామచంద్రన్ మరియు కరుణానిధి పాత్రలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా..అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ నటిస్తున్నసంగతి తెలిసిందే.

అంతేకాదు జయలలిత ప్రాణ స్నేహితురాలు, సన్నిహితురాలు అయిన శశికళ పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. జయలలిత జీవితంలో శోభన్ బాబు పాత్ర ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె లైఫ్‌లో శోభన్ బాబు పాత్ర కీలకం. మరి అలాంటి పాత్రలో నటించే అదృష్టం ఎవరికి దక్కిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ రోల్ కోసం విజయ్‌ దేవరకొండను అడగగా.. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ ఆగాల్సిందే.

ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు, జయసుధ, సత్యరాజ్ ముఖ్య పాత్రలలో నటించనున్నట్టు తెలుస్తుంది. విబ్రి మీడియా బ్యానర్ పై విష్ణు ఇందూరి నిర్మాణ సారథ్యం లో ఈ సినిమా రూపొందుతుంది. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ రైటర్ గా పనిచేస్తున్న ఈ మూవీ కి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తమిళ్ తో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + sixteen =