యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `ఫైటర్` అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్… బాక్సర్ గా కనిపించనున్నాడని టాక్. అంతేకాదు… యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో పాన్ – ఇండియా ప్రాజెక్ట్ గా దీన్ని నిర్మించాలని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా కియారా అద్వానిని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇదివరకు జాన్వీ కపూర్, ప్రియా ప్రకాష్ వారియర్, నిధి అగర్వాల్ పేర్లు వినిపించినా… ఆ అవకాశం కియారా చెంతకు చేరిందన్నది లేటెస్ట్ టాక్. ఇప్పటికే ఓ కమర్షియల్ లో విజయ్, కియారా జంటగా మెరిసారు. మరి… సినిమాలోనూ జట్టుకడతారేమో చూడాలి.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… విజయ్ కెరీర్ ని మలుపు తిప్పిన `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `కబీర్ సింగ్`లో కియారా నాయికగా నటించింది. మరి… ఒకే కథతో వేర్వేరుగా విజయాలు చూసిన ఈ ఇద్దరూ ఒకే సినిమాలోనూ మురిపిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ!
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























