వర్మ ‘బ్యూటిఫుల్’ కు సెన్సార్ పూర్తి

రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్యూటిఫుల్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై బ్యూటిఫుల్ అనే సినిమా తెరకెక్కుతుంది. నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి, మొదటి సింగల్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.ఎలాంటి కట్స్ లేకుండా నేరుగా ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ బృందం. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు.

ఇదిలా ఉండగా సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ఇక తన సినిమాలకు ఎప్పుడూ వచ్చే ప్రాబ్లమే ఈ సినిమాకు కూడా వచ్చింది. అసలు టైటిల్ తోనే వివాదానికి తెరలేపిన వర్మ.. ఆఖరికి అదే టైటిల్ మార్చాల్సి వచ్చింది. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని టైటిల్ ను మార్చారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చాయి. సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు సభ్యులు. మరి చూద్దాం తన శిష్యుడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. తన సినిమాకు ఎప్పుడు వస్తుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.