ఓ దేవుడా ఫైనల్లీ డేట్ ఫిక్స్ చేశావ్ – ‘వెంకీ’మామ కామెడీ

Hero Venkatesh Showers His Love On Akkineni Naga Chaitanya, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Venkatesh About Hero Naga Chaitanya, Venkatesh Showers His Love On Naga Chaitanya, Victory Venkatesh Showers His Love On Akkineni Naga Chaitanya

ఎన్నో కన్ఫ్యూజన్ ల తర్వాత ఫైనల్ గా రెండు రోజుల క్రితం వెంకీమామ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను ఇంత త్వరగా రిలీజ్ చేస్తారని ఊహించని ఫ్యాన్స్.. ఇంత తొందరగా మామాఅల్లుళ్లు సందడి చేయడానికి వస్తుండటంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ కు ఇంకా పదిరోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు చిత్రబృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా మొన్నటివరకూ ‘వెంకీమామ’ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో పలు కామెంట్లు, కామెడీ మీమ్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా.. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా రిలీజ్ డేట్ పై వెంకీ కూడా కామెడీ చేసి నవ్వించారు. ఈవెంట్ లో పాల్గొన్న వెంకీ మాట్లాడుతూ.. “చాలా థాంక్స్ దేవుడా.. ఫైనల్లీ డిసెంబర్ 13వ తేదీన సినిమా వస్తుంది.. చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం దేవుడా.. ఎప్పుడూ ఇంత టెన్షన్ లేదు దేవుడా.. ‘వెంకీమామ’ అన్నారు మిలట్రీ మామ అన్నారు.. చాలా టఫ్ అన్నారు.. ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రోజులు తీసుకున్నారు.. థ్యాంక్స్ సురేష్ ప్రొడక్షన్స్.. థ్యాంక్స్ అన్నయ్య.. ఫైనల్లీ టెన్షన్ ముగిసింది అని తన కామెడీతో నవ్వించారు. ఇంకా ఈ కింద వున్న లింక్ క్లిక్ చేసి వెంకీ కామెడీ చూసి నవ్వుకోండి..


కాగా బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా తెరకెక్కిన సినిమా ‘వెంకీమామ’. ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + nineteen =