మ‌ళ్ళీ ద‌స‌రాకే రానున్న చిరు?

Megastar Chiranjeevi To Come Again On Dussehra Next Year,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Megastar Chiranjeevi New Movie Updates,Megastar Chiranjeevi Latest Movie Details,Megastar Chiranjeevi Upcoming Film News

ఈ ఏడాది ద‌స‌రా సీజ‌న్ లో `సైరా న‌ర‌సింహారెడ్డి` అంటూ ప‌ల‌క‌రించిన మెగాస్టార్ చిరంజీవి… వ‌చ్చే సంవ‌త్స‌రం కూడా విజ‌య‌ద‌శ‌మి బ‌రిలోనే వినోదాలు పంచ‌బోతున్నార‌ట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్ లో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… ద‌స‌రాకి పూజా కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంది. అయితే, రెగ్యుల‌ర్ షూటింగ్ మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం… జ‌న‌వ‌రి నుంచి చిత్రీక‌ర‌ణ సాగుతుంద‌ని తెలిసింది. అయితే, చిత్రీక‌ర‌ణ – నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాల‌కు 8 నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉండ‌డంతో… ద‌స‌రా సీజ‌న్ లో సినిమాని రిలీజ్ చేయాల‌ని యూనిట్ భావిస్తోంద‌ట‌. అదే గ‌నుక నిజ‌మైతే… `సైరా` త‌రువాత చిరు నుంచి వ‌చ్చే సినిమాకి మ‌రో ఏడాది స‌మ‌యం పడుతున్న‌ట్టే.

`చిరు 152`ని మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, నిరంజ‌న్ రెడ్డి నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 7 =