కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 17

సినిమా వార్తలు

ఉత్తమ నటుడిగా 'విజయ్'

భరత్ కమ్మ దర్శకత్వంలో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమామాత్రం.. ఆ అంచనాలను రీచ్ అవ్వలేదు. అయితే తీసుకున్న కథకు మాత్రం మంచి ప్రశంసలు దక్కాయి. కొంచం ల్యాగ్ ఉండటం వల్ల ఈ సినిమాకు కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది... అదే కొంచం ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. విజయ్ ఖాతాలో మరో హిట్ పడేది. ఇదంతా వేరే విషయం అనుకోండి. అయినా సినిమా రిలీజ్ ఎప్పుడో అయింది... ఇప్పుడు ఈ సినిమా గురించి ఎందుకు అనుకుంటున్నారా..?

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రానా నిర్మాతగా సమర్పణలో సిద్దు సినిమా

టాలెంటెడ్ హీరో రానా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో `విరాట ప‌ర్వం`లో న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత `హిర‌ణ్య క‌శ్య‌ప‌` చేయబోతున్న సంగతి విదితమే. స్టార్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ బ‌డ్జెట్ ఫిల్మ్ గా తెర‌కెక్క‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో టైటిల్ రోల్ ప్లే చేయ‌బోతున్నాడు రానా. ఫిబ్ర‌వ‌రి రెండో వారంలో చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డి కానున్నాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫైటర్ తో బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్..!

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో 'వరల్డ్ ఫేమస్ లవర్' అనే సినిమా బిజీలో వున్నాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి లీట్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఫిబ్రవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ గా కనిపించనున్నాడట.

TFN Adminవాట్సాప్
Suresh Babu Gives Clarity About Abhiram Entry
సినిమా వార్తలు

అసురన్ రీమేక్ లో అభిరామ్ ఎంట్రీపై సురేష్ బాబు క్లారిటీ..!

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్' మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలుతీసుకున్నారు. ఎంతో మంది పేర్లను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకి ఫిక్స్ అయ్యారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి' ట్రైలర్ రిలీజ్

ధన్య బాలకృష్ణ, కోమలీ ప్రసాద్, త్రిదా చౌదరి మరియు సిద్ది ఇరానీ ప్రధాన పాత్రల్లో బాలు అడుసుమిల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి'. ప్రస్తుతం పోస్ట్ పొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. హీరో నితిన్ చేతుల మీదుగా ఈ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం నాలుగు భాషల్లో ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రజినీ సర్ తో సినిమా - నా కెరీర్ లో మైల్ స్టోన్

తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. వాటితో పాటు ‘మిస్ ఇండియా’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తోంది. ఇక తాజాగా మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది ఈ భామ.

TFN Adminవాట్సాప్
Music Director Thaman S In Superb Form,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Music Director Thaman Latest News,Music Director Thaman Upcoming Movie News,Music Director Thaman Next Film News,Music Dir
సినిమా వార్తలు

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న తమన్

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఈ పేర్లే వినిపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే.. దేవిని కూడా వెనక్కి నెట్టేసి తమన్ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. కిక్ సినిమాతో తన ప్రయాణాన్నిమొదలు పెట్టిన తమన్ వరుస సినిమాలతో బిజీ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ప్రస్తుతం పలు సినిమాలు తమన్ చేతిలో వున్నాయి.

TFN Adminవాట్సాప్
'సరిలేరు నీకెవ్వరు' సెకండ్ సాంగ్ రిలీజ్
సాంగ్

'సరిలేరు నీకెవ్వరు' సెకండ్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. ఇప్పటికే టీజర్ ను, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా వాటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
#AlaVaikunthapurramulooTeaser, Ala Vaikunthapurramuloo Movie New Teaser, Ala Vaikunthapurramuloo Movie Teaser, Ala Vaikunthapurramuloo Movie Updates, Ala Vaikunthapurramuloo Teaser, Ala Vaikunthapurramuloo Teaser Glimpse Out, Ala Vaikunthapurramuloo
ట్రైలర్ & టీజర్

'అల వైకుంఠపురములో' టీజర్ గ్లింప్స్ వీడియో రిలీజ్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా' పాటలు రిలీజ్ చేయగా వాటికీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ రోజు టీజర్ రిలీజ్ అప్ డేట్ కూడా ఇచ్చేసారు. డిసెంబర్ 11వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా టీజర్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Actress Trisha To Perform High Octane Action Sequences In Tamil Movie Raangi
సినిమా వార్తలు

"రాంగీ "తమిళ మూవీ లో త్రిష యాక్షన్ సీన్స్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్. శరవణన్ దర్శకత్వంలో త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఉమెన్ సెంట్రిక్ మూవీ "రాంగీ "తమిళ భాష లో రూపొందుతుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ లో త్రిష యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించారని సమాచారం. ఈ మూవీ కి ప్రముఖ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ కథ ను అందించడం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వైష్ణవ్ తేజ్ హీరోగా మరో మూవీ ?

హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ "ఉప్పెన " మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ తమిళ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
DSP About His Upcoming Releases
సినిమా వార్తలు

మూడు సినిమాలు.. మూడు పాటలు

ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్‌లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. అందుకే గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దేవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు దేవి. మూడు డిఫరెంట్ సినిమాలు... మూడు డిఫరెంట్ పాటలు ఈ రోజు షూట్ చేశామని.. చాలా ఎగ్జైటెడ్ గా ఉందని ట్వీట్ లో…

TFN Adminవాట్సాప్
సాంగ్

అమ్మ రాజ్యం లో .. మూవీ "చంపేస్తాడు "సాంగ్ రిలీజ్

టి .అంజయ్య సమర్పణలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్, అజయ్ మైసూరు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఆర్ జి వి శిష్యుడు సిద్ధార్ధ్ తాతోలు దర్శకత్వంలో నిజ రాజకీయ నేతల పాత్రలతో రూపొందిన "అమ్మ రాజ్యం లో కడప బిడ్డలు " మూవీ డిసెంబర్ 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి రచన, సహకార దర్శకత్వం ఆర్ జి వి అందించారు. బ్రహ్మానందం, అలీ ముఖ్య పాత్రలలో నటించారు.

Team TFNవాట్సాప్
Kartikeya Wants To Play Negative Roles,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Kartikeya Latest News,Kartikeya New Movie Updates,Kartikeya Next Film Updates,Kartikeya Latest Movie Details,Kartikeya Nex
సినిమా వార్తలు

నెగెటివ్ రోల్స్ లో నటించాలని ఉంది..!

'RX 100'తో ఆరంగేట్రం చేసి.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కార్తికేయ. ఈ సినిమా తరవాత 'గుణ369', 'హిప్పీ' లాంటి భారీ సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కాలేదు. రీసెంట్ గా వచ్చిన 90 ఎంఎల్ కు కాస్త పాజిటివ్ టాకే వచ్చింది. ప్రస్తుతం 2 సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీ గా వున్నాడు కార్తికేయ.

TFN Adminవాట్సాప్
Mathu Vadalara Movie Release Date Confirmed
రిలీజ్ అప్‌డేట్

'మత్తు వదలరా' రిలీజ్ డేట్ ఫిక్స్

రాజ‌మౌళి కుటుంబం నుంచి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు న‌టులు రాలేదు. ఇప్పటి వరకు ఆ కుటుంబం నుంచి దర్శకులు వచ్చారు.. రచయితలు, గాయకులు ఇలా అంతా టెక్నీషియన్లే వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఈ లోటు కూడా తీర‌బోతుంది. హీరో లేడ‌నే లోటును భ‌ర్తీ చేయ‌డానికి ఆ కుటుంబం నుంచి కూడా ఓ వార‌సుడు వ‌చ్చేస్తున్నాడు. కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా నటిస్తున్న మత్తు వదలరా సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేసారు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడమే కాదు సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Pooja Hegde Entertains Audience With Back To Back Movies
సినిమా వార్తలు

2020లో పూజా హెగ్డే జోరు

ఈ ఏడాది `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`, `హౌస్ ఫుల్ 4` (హిందీ) చిత్రాల‌తో సంద‌డి చేసిన స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే... వ‌చ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటిలో మూడు తెలుగు చిత్రాలుంటే... మ‌రో రెండు హిందీ ఫిల్మ్స్ కావ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆసక్తిక‌ర నేప‌థ్యంతో `రూల‌ర్`

`జై సింహా` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, స్టార్ డైరెక్ట‌ర్ కె.య‌స్.ర‌వికుమార్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా `రూల‌ర్`. ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెల 20న థియేట‌ర్ల‌లోకి రానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

జూన్ నుంచి `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌?

కింగ్ నాగార్జున కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. 2016 సంక్రాంతికి విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీలో బంగార్రాజుగా, రాముగా రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేశారు నాగ్. కాగా, ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంది. `సోగ్గాడే..`ని తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ కృష్ణ‌నే... కొన‌సాగింపు చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫిల్మ్ సిటీలో `స‌రిలేరు నీకెవ్వ‌రు`

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు, మ‌హేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చివ‌రి షెడ్యూల్ ని షూట్ చేస్తున్నార‌ని టాక్. ఈ నెల 20 వ‌ర‌కు సాగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించ‌నున్నారని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భాగ్య‌న‌గ‌రంలో నితిన్ - చంద్ర‌శేఖ‌ర్ యేలేటి చిత్రం

యువ క‌థానాయ‌కుడు నితిన్, వైవిధ్య‌భ‌రిత చిత్రాల ద‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ యేలేటి కాంబినేష‌న్ లో ఓ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సినిమాని భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో నితిన్ చెస్ ప్లేయ‌ర్ క‌నిపించ‌నుండ‌గా... ర‌కుల్ క్రిమిన‌ల్ లాయ‌ర్ గానూ, ప్రియా ప్ర‌కాష్ హ‌నీ ట్రాప‌ర్ గానూ ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్

షేర్