2020లో పూజా హెగ్డే జోరు

Pooja Hegde Entertains Audience With Back To Back Movies

ఈ ఏడాది `మ‌హ‌ర్షి`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`, `హౌస్ ఫుల్ 4` (హిందీ) చిత్రాల‌తో సంద‌డి చేసిన స్ట‌న్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే… వ‌చ్చే ఏడాది ఏకంగా ఐదు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతోంది. వీటిలో మూడు తెలుగు చిత్రాలుంటే… మ‌రో రెండు హిందీ ఫిల్మ్స్ కావ‌డం విశేషం.

2020 సంక్రాంతికి అల్లు అర్జున్ `అల వైకుంఠ‌పుర‌ములో`తో సంద‌డి చేయ‌నున్న పూజ‌… వేస‌విలో అఖిల్ కి జోడీగా న‌టిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని సినిమాతో ప‌ల‌క‌రించ‌బోతోంది. ఇక ఏడాది ద్వితీయార్ధంలో ప్ర‌భాస్ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీతో మెస్మ‌రైజ్ చేయ‌బోతోంది. ఇక హిందీలోనూ `హౌస్ ఫుల్ 4` నిర్మాత నిర్మించ‌నున్న సినిమాతో పాటు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ తో హ‌ల్ చ‌ల్ చేయ‌బోతోంది పూజ‌. మ‌రి… 2020 పూజ‌కి ఏ మేర‌కు క‌లిసొస్తుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here