
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 18


"వెంకీ మామ " మూవీ హైలైట్

'రూలర్' ట్రైలర్ రిలీజ్

వెంకీ, నాని... ఓ మల్టీస్టారర్?

హారర్ ఫిల్మ్ లో `మల్లీశ్వరి‘

'వెంకీమామ' ట్రైలర్ రిలీజ్

జాన్ బడ్జెట్ కూడా భారీగానే..!

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?

'మత్తు వదలరా' టీజర్ రిలీజ్
ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్
రవితేజ, థమన్ ఎస్ కాంబినేషన్ మూవీస్

అసురన్ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ..!

"అల .. వైకుంఠపురములో .. " మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. " మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"వెంకీ మామ " మూవీ హైలైట్
విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా థమన్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన వెంకీ మామ " మూవీ రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, కశ్మీర్ లలో షూటింగ్ జరుపుకుంది.

బాలయ్య - బోయపాటి సినిమాలో...?
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాను చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను క్రిస్మస్ పండుగ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

'రూలర్' ట్రైలర్ రిలీజ్
కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా... వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

యూట్యూబ్ లో 7వ స్థానంలో దూసుకుపోతున్న 'రౌడీబేబీ' సాంగ్
ధనుష్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా మారి 2 అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే ఈ సినిమాలోని రౌడీ బేబీ పాట మాత్రం యూ ట్యూబ్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే సినిమా విడుదలైన కొద్ది రోజులకే చిత్రయూనిట్ రౌడీబేబీ వీడియో సాంగ్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి రికార్డులు సృష్టిస్తూనే వుంది. ఇక తాజాగా మరో రికార్డు ను క్రియేట్ చేసింది.

వెంకీ, నాని... ఓ మల్టీస్టారర్?
`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`తో మల్టీస్టారర్స్ కు శ్రీకారం చుట్టారు సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఆపై `మసాలా`, `గోపాలా గోపాలా`, `ఎఫ్ 2` వంటి మరో మూడు మల్టీస్టారర్స్ తో కనువిందు చేశారు. ఇక తన పుట్టిన రోజున (డిసెంబర్ 13) తన మేనల్లుడు, యువ సామ్రాట్ నాగచైతన్యతో కలసి నటించిన `వెంకీమామ`తో పలకరించబోతున్నారాయన.

భాగ్యనగరంలో అఖిల్, పూజ చిందులు
యంగ్ హీరో అఖిల్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా `బొమ్మరిల్లు` భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ స్వరాలు సమకూర్చుతున్నాడు.

హారర్ ఫిల్మ్ లో `మల్లీశ్వరి‘
కథానాయికగా కత్రినా కైఫ్ ది పదహారేళ్ళ నటప్రస్థానం. ఈ ప్రయాణంలో పలు హిందీ చిత్రాలతో పాటు తెలుగు, మలయాళ సినిమాల్లోనూ సందడి చేసింది ఈ అందాల తార. ముఖ్యంగా... తెలుగులో టైటిల్ రోల్ లో నటించిన `మల్లీశ్వరి` తనకి ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది.

'వెంకీమామ' ట్రైలర్ రిలీజ్
బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత 'వెంకీమామ' చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ కమిటీ `వెంకీమామ`కి `యు/ఎ` సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'అర్జున్ సురవరం' ఫస్ట్ వీక్ కలెక్షన్స్
విడుదలకు ఎన్నో ఇబ్బందులు వచ్చినా ఫైనల్ విడుదలై మొత్తానికి డీసెంట్ హిట్ టాకే తెచ్చుకుంది నిఖిల్ 'అర్జున్ సురవరం'. నవంబర్ 29 వ తేదీన రిలీజ్ ఐన ఈ సినిమా మొదటిరోజే మంచి టాకే తెచ్చుకొని... కలెక్షన్స్ పరంగా కూడా పరవాలేదనిపించింది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకొని... నిఖిల్ గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు.ఇక ఈ సినిమా వన్ వీక్ లో మంచి కలెక్షన్సే రాబట్టిన్నట్టు తెలుస్తుంది.

'సరిలేరు నీకెవ్వరు' రెండో పాటకు ముహూర్తం ఫిక్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కేరళలో ఆఖరి షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఈ లాంగ్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది.

జాన్ బడ్జెట్ కూడా భారీగానే..!
సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది.అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు జాన్ షూటింగ్ లో బిజీ అయ్యాడు.

ఫైనల్ గా థియేటర్స్ కి వస్తున్న 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'
సంచలన దర్శకుడైన రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అనే మరొక వివాదస్పద సినిమా తో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్‌మెంట్ దగ్గర నుంచే వివాదాస్పదమైంది. వివాదాలు తలెత్తడంతో అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే టైటిల్ ను కూడా మార్చారు. ఇక సినిమా రిలీజ్ కు కూడా ఇబ్బందులు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు హైకోర్ట్ స్టే ఇవ్వడంతో రిలీజ్ కూడా లేట్ అయింది. ఇక ఇప్పుడు వివాదాలను తొలగించుకొని రిలీజ్ కు సిద్ధమైంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భారీ రేటు కు 'అల వైకుంఠపురములో' రైట్స్..?
త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా 'అల వైకుంఠపురములో'. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలోభాగంగానే ఈ సినిమా నుండి ఇప్పటివరకూ 'సామజవరగమనా', 'రాములో రాములా', 'ఓ మై డాడీ' పాటలు రిలీజ్ చేయగా త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

'మత్తు వదలరా' టీజర్ రిలీజ్
నూతన దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలోప్రముఖ సంగీత దర్శకుడు MM కీరవాణి తనయుడు సింహ కోడూరి హీరోగా వస్తున్న న్యూ ఏజ్ మూవీ మత్తువదలరా. ఈ సినిమా ద్వారా సింహ హీరో గా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టింది చిత్రయూనిట్.

" ఇద్దరి లోకం ఒకటే " మూవీ లో"అదే ఊరు "సాంగ్ రిలీజ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఇద్దరి లోకం ఒకటే " మూవీ డిసెంబర్ 25వ తేదీ రిలీజ్ కానుంది. షాలిని పాండే ఒక స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్ లో నటించిన ఈ మూవీ కి మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. నాజర్ ముఖ్య పాత్రలో నటించారు.
ఖమ్మం లో "వెంకీ మామ " ప్రీ రిలీజ్ ఈవెంట్
సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె యెస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ డిసెంబర్ 13వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు . థమన్ ఎస్ సంగీతం అందించారు. "వెంకీ మామ " మూవీ లో రియల్ లైఫ్ మామా అల్లుళ్ళు వెంకటేష్, నాగచైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్ళు గా నటించడం విశేషం.
రవితేజ, థమన్ ఎస్ కాంబినేషన్ మూవీస్
సక్సెస్ ఫుల్ సంగీత దర్శకుడు థమన్ ఎస్ ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగొందుతున్న. థమన్ ఎస్ సంగీతం అందించిన "వెంకీ మామ ", "అల వైకుంఠపురములో .. ", డిస్కో రాజా "మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. "మిస్ ఇండియా", "సోలో బ్రతుకే సో బెటర్ "," క్రాక్ ", "టక్ జగదీష్ " మూవీస్ కు థమన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు.

అసురన్ రీమేక్ తో అభిరామ్ ఎంట్రీ..!
తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్' మూవీ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ధనుష్ కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమాను ఇప్పుడు తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలుతీసుకున్నారు. ఎంతో మంది పేర్లను పరిగణలోకి తీసుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకి ఫిక్స్ అయ్యారు.
రెండు బాలీవుడ్ బిగ్ మూ వీస్ కు పూజ హెగ్డే గ్రీన్ సిగ్నల్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న పూజ హెగ్డే "ఒక లైలా కోసం " వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో టాలీవుడ్ కు ప్రవేశించారు. పూజ నటించిన "దువ్వాడ జగన్నాధం ", "అరవింద సమేత వీర రాఘవ ", "మహర్షి ", "గద్దల కొండ గణేష్ " మూవీస్ ఘనవిజయం సాధించాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ మూవీస్ లో హీరోయిన్ గా తక్కువ కాలంలోనే పూజ హెగ్డే నటించడం విశేషం.