ఫిల్మ్ సిటీలో `స‌రిలేరు నీకెవ్వ‌రు`

Sarileru Neekevvaru Movie Team Shoots Crucial Scenes In Film City

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 26వ చిత్రం `స‌రిలేరు నీకెవ్వ‌రు`. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ ఫ్యామిలీ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు, మ‌హేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చివ‌రి షెడ్యూల్ ని షూట్ చేస్తున్నార‌ని టాక్. ఈ నెల 20 వ‌ర‌కు సాగే ఈ షెడ్యూల్ లో కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించ‌నున్నారని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ‌హేష్ కి జోడీగా ర‌ష్మిక న‌టిస్తున్న ఈ సినిమా ద్వారా అల‌నాటి లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీలు అందిస్తున్నాడు. కాగా, జ‌న‌వ‌రి 11న `స‌రిలేరు నీకెవ్వ‌రు` థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. మ‌రి… `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`… ఇలా వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న మ‌హేష్ ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 3 =