జూన్ నుంచి `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్‌?

Soggade Chinni Nayana Movie Sequel Shoot Begins In June 2020

కింగ్ నాగార్జున కెరీర్ లో హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ గా నిల‌చిన చిత్రం `సోగ్గాడే చిన్ని నాయ‌నా`. 2016 సంక్రాంతికి విడుద‌లైన ఈ సోషియో ఫాంట‌సీలో బంగార్రాజుగా, రాముగా రెండు విభిన్న పాత్ర‌ల్లో సంద‌డి చేశారు నాగ్. కాగా, ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీకి ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ జ‌రుగుతోంది. `సోగ్గాడే..`ని తెర‌కెక్కించిన క‌ళ్యాణ్ కృష్ణ‌నే… కొన‌సాగింపు చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేయ‌బోతున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు.. నాగ్ తో పాటు నాగ‌చైత‌న్య కూడా ఈ సీక్వెల్ లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఇదిలా ఉంటే… ఈ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ ని జూన్ లో ప్రారంభిస్తార‌ని టాక్. ఆపై చ‌క‌చ‌కా చిత్రీక‌ర‌ణ జ‌రిపి… 2021 సంక్రాంతికి సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చే దిశ‌గా ప్లానింగ్ జ‌రుగుతోంద‌ని స‌మాచారం. మ‌రి… ఐదేళ్ళ త‌రువాత రాబోతున్న ఈ సీక్వెల్ కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − ten =