ఫాస్ట్ బీట్ అయినా.. మెలోడీ సాంగ్ అయినా..ఇక ఐటెమ్ సాంగ్లంటే దేవీ స్పెషలిస్ట్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు… ఏ సాంగ్ అయినా సరే దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో అందరినీ మ్యాజిక్ చేసేస్తాడు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమంటే నచ్చని వారెవరూ ఉండరు. అందుకే గత దశాబ్ద కాలంపాటుగా ఎంతో మంది స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేస్తూ.. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. దేవి ప్రస్తుతం పలు సినిమాలతో బిజీ గా వున్న సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు దేవి. మూడు డిఫరెంట్ సినిమాలు… మూడు డిఫరెంట్ పాటలు ఈ రోజు షూట్ చేశామని.. చాలా ఎగ్జైటెడ్ గా ఉందని ట్వీట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లాక్ రిలీజ్ చేయగా.. ఈ రోజు రెండో పాటను రిలీజ్ చేయనున్నారు.
ఇక సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాదే సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఒక మెలోడీ సాంగ్ ను షూట్ చేసినట్టు తెలిపాడు.
వీటితో పాటు కీర్తి సురేష్ ‘గుడ్ లక్ సఖి’ సినిమాకు కూడా దేవి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని కాన్సెప్ట్ సాంగ్ ను షూట్ చేసినట్టు ట్వీట్ లో పేర్కొన్నాడు.
3 of My Songs Frm 3 different movies r bein SHOT 2day😁🎥
So am MUSICALLY Excited😁🎵
1. DANCE NUMBER frm #SLN wit @urstrulyMahesh sir& @tamannaahspeaks 💃
2. ROMANTIC MELODY frm #UPPENA❤️
3.A Uniquely Orchestrated Concept Song frm @KeerthyOfficial #GoodLuckSakhi movie
🙏🏻🎹 pic.twitter.com/XNZhguCpbX— DEVI SRI PRASAD (@ThisIsDSP) December 9, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: